ఒకేసారి ఇన్ని ట‌చ్చింగులా..?

Last Updated on by

ర‌వితేజ ఒక్క‌సారి మొద‌లుపెడితే అస్స‌లు ఆగ‌డు. అది సినిమాలైనా.. విజ‌యాలైనా.. ఫ్లాపులైనా..! ఏదైనా వెంట‌వెంట‌నే ఇస్తుంటాడు. ఇప్పుడు  కూడా ఈయ‌న ట‌చ్ చేసి చూడు సినిమాతో అభిమానుల‌కు వ‌ర‌స‌గా వ‌రాలిచ్చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. పాట‌లు కూడా విడుద‌ల‌య్యాయి. ఆడియో వేడుక మాత్రం అభిమానుల కోసం జ‌న‌వ‌రి 25న జ‌ర‌ప‌బోతున్నారు. ఈ చిత్రానికి ప్రీత‌మ్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఉన్న ప్రీత‌మ్.. ర‌వితేజ కోసం టాలీవుడ్ కు వ‌చ్చాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టైటిల్ సాంగ్ తో పాటు మ‌న‌సా సాంగ్ కు కూడా మంచి అప్లాజ్ వ‌స్తుంది. ఇక జ‌న‌వ‌రి 25న ట్రైల‌ర్ తో పాటు ప్రోమో సాంగ్స్ కూడా రానున్నాయి. జ‌న‌వ‌రి 25న ఆడియో వేడుక అయితే.. 26న ర‌వితేజ పుట్టిన‌రోజు. అంటే ఒక‌రోజు ముందే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నాడు మాస్ రాజా. ఇక సినిమాను ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల చేయ డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అంటే జ‌న‌వ‌రి 25 నుంచి ఫిబ్ర‌వ‌రి 2 మ‌ధ్య‌లో ర‌వితేజ ట‌చ్చింగ్ వారోత్స‌వాలు జ‌ర‌గబోతున్నాయ‌న్న‌మాట‌.

Follow US 

User Comments