నేల‌టికెట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

Last Updated on by

అవును.. మీరు చూసింది క‌రెక్టే..! నిజంగానే నేల‌టికెట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న నేల‌టికెట్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నాడు. ఈ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమాల‌తో పాటు బ‌య‌టి సినిమాల వేడుక‌ల‌కు కూడా వ‌స్తున్నాడు. ఈయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నాడు కానీ ఇండ‌స్ట్రీకి మాత్రం కాదు. అదే క్ర‌మంలో ఇప్పుడు నేల‌టికెట్ ఆడియో వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ రాబోతున్నాడు. అఫీషియ‌ల్ గా నిర్మాత రామ్ త‌ళ్లూరి ఈ విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసాడు. మే 10న జ‌ర‌గబోయే ఈ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ వ‌స్తున్నాడు. అయితే అది ఎక్క‌డ ఎప్పుడు జ‌ర‌గ‌నుంది అనేది మాత్రం చెప్ప‌లేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మేలోనే విడుద‌ల కానుంది నేల‌టికెట్. ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికి కార‌ణం క‌ళ్యాణ్ కృష్ణ ట్రాక్ రికార్డ్. ఇక ఈ ఆడియో వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ రావ‌డం మాత్రం కాస్త ఆశ్చ‌ర్యంగా ఉంది అభిమానుల‌కు. దానికి కార‌ణం నిర్మాత రామ్ త‌ళ్లూరితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న సాన్నిహిత్య‌మే అని తెలుస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో రంగ‌స్థ‌లం.. ఛ‌ల్ మోహ‌న్ రంగ వేడుక‌ల‌కు వ‌చ్చాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మ‌రి ఇప్పుడు నేల‌టికెట్ ఆడియోలో ప‌వ‌న్ ప్ర‌జెన్స్ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments