ఫ్రేమ్ అదిరింది.. మాస్ రాజా ర‌వితేజ

Last Updated on by

ఒక్క ఫోటోలో ఇంత‌మందా..? బాబోయ్ ఇక్క‌డేమైనా జాత‌ర జ‌రుగుతుందా అనుకుంటున్నారా..? అవును.. చిన్న‌సైజ్ జాత‌రే జ‌రుగుతుంది. కాకపోతే ఆ జాతర పేరు సినిమా షూటింగ్. ఇదంతా ర‌వితేజ కుటుంబం. ఒక్కరో ఇద్ద‌రో కాదు.. దాదాపు 50 మందితో క‌లిసి షూటింగ్ చేస్తున్నాడు ఈ హీరో. ఈయ‌న ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జ‌న‌వ‌రిలో మొద‌లైన ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే 40 శాతం పూర్తైంది. తాజాగా ఈ షూటింగ్ బ్రేక్ లోనే ఓ పిక్ తీసి ట్విట్ట‌ర్ లో పెట్టాడు ర‌వితేజ‌. అది చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే ఆ పిక్ కు ఉన్న విలువ అలాంటిది మ‌రి. షూటింగ్ లో ఉన్న అంద‌ర్నీ తీసి ఒకే ఫ్రేమ్ లో బంధించి ఈ పిక్ పోస్ట్ చేసాడు మాస్ రాజా. ఇది చూసిన త‌ర్వాత అభిమానులు అయితే ఖచ్చితంగా ఫిదా అయిపోక మాన‌రు. క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాలో ర‌వితేజ ప‌క్కా మాస్ అవ‌తార్ లో క‌నిప‌స్తున్నాడు. దీనికి నేల టికెట్ అనే ప‌క్కా మాస్ టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

ఈ సినిమా నుంచి నిర్మాత‌కు అప్పుడే పాతిక కోట్లు కూడా వ‌చ్చేసాయి. అది ర‌వితేజ రేంజ్ అంటే..! ఎలా ఉంటుందో కూడా తెలియ‌కుండానే సినిమా రైట్స్ అన్నీ 25 కోట్ల‌కు అమ్ముడైపోయాయి. అది కేవ‌లం ర‌వితేజ‌ ఇమేజ్ వ‌ల్లే. ఈ సినిమా శాటిలైట్, డిజిట‌ల్, హిందీ రైట్స్ క‌లిపి ఏకంగా పాతిక కోట్లు ప‌లికాయి. మాస్ రాజా సినిమాల‌కు హిందీలో చాలా గిరాకీ ఉంటుంది. ఈయ‌న ప్ర‌తీ సినిమా అక్క‌డ టీవీల్లో సూప‌ర్ హిట్టే. దాంతో బొమ్మ ఎలా ఉంటుందో తెలియ‌కుండానే ఇప్పుడు నేల‌టికెట్ ను భారీ రేట్ కు కొనేసారు. ట‌చ్ చేసి చూడు దారుణంగా నిరాశ ప‌రిచినా కూడా ర‌వితేజ మార్కెట్ కు వ‌చ్చిన న‌ష్ట‌మేం లేద‌న్న‌మాట‌. ఈ రేంజ్ చూసే ఇప్ప‌టికీ సినిమాకు 10 కోట్లు అడుగుతున్నాడు మాస్ రాజా. త‌ప్పేం లేదేమో ఈ మాత్రం డిమాండ్ చేయ‌డం కూడా..!

User Comments