`డిస్కో రాజా` అక్టోబ‌ర్ నుంచి..

Last Updated on by

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌- క‌ళ్యాణ్ కృష్ణ కాంబినేష‌న్ మూవీ `నేల టిక్కెట్` వ‌చ్చే నెల‌లో రిలీజవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనర్ అని ద‌ర్శ‌కుడు ఇదివ‌ర‌కూ వెల్ల‌డించారు. ఈ సినిమాతో పాటు శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలోని `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. ఈలోగానే ర‌వితేజకు సంబంధించిన మ‌రో హాట్ అప్‌డేట్ అందింది.

మాస్ మ‌హారాజా హీరోగా టైగ‌ర్‌, ఒక్క క్ష‌ణం, ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా చిత్రాల ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ఓ సినిమాని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ప‌క్కా మాస్‌ టైటిల్ ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. `డిస్కో రాజా` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశార‌ట‌. ఇదే విష‌యంపై ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్‌ని ప్ర‌శ్నిస్తే ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌స్తుతం `డిస్కో రాజా` ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి… అక్టోబ‌ర్ నుంచి సెట్స్‌పైకి వెళుతున్నాం అని తెలిపారు. పూర్తి కామెడీ-ఫ‌న్ జోన‌ర్‌లో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. నేల టిక్కెట్, అమ‌ర్ ఆక్భ‌ర్ ఆంటోని, డిస్కో రాజా .. ఈ మూడింట్లో ఒక‌టి క్లాస్సీ టైటిల్‌, మిగ‌తా రెండూ ప‌క్కా మాస్ టైటిల్స్‌. ర‌వితేజ ఎంపిక‌లు త‌న‌దైన శైలిలో సాగుతున్నాయ‌ని చెప్పొచ్చు.

User Comments