గోపీచంద్ ఖాతాలో ర‌వితేజ సినిమా

ఇండ‌స్ట్రీ అన్న త‌ర్వాత ఒక‌రి సినిమాలు మ‌రొక‌రికి వెళ్ల‌డం కామ‌న్. వాళ్లు చేయ‌క‌పోతే ద‌ర్శ‌కులు ఊరికే ఉండ‌రు క‌దా.. మ‌రో హీరోకు అదే క‌థ చెప్పి ఒప్పిస్తారు. ఇలా బోలెడ‌న్ని సినిమాలు ఉంటాయి. ఈ మ‌ధ్యే వ‌చ్చిన శ‌త‌మానం భ‌వ‌తి, నేను లోక‌ల్ సినిమాలు రెండూ రాజ్ త‌రుణ్ చేయాల్సిన సినిమాలే. కానీ అవి ఇత‌ర హీరోల‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ర‌వితేజ చేయాల్సిన సినిమా ఒక‌టి గోపీచంద్ చేతుల్లోకి వెళ్ల‌బోతుంది. గ‌తేడాది చ‌క్రి అనే కొత్త ద‌ర్శ‌కుడు ర‌వితేజ‌తో రాబిన్ హుడ్ సినిమా ప్లాన్ చేసాడు. కానీ ర‌వితేజ అప్ప‌టికి సినిమా మూడ్ లో లేక క‌థ వ‌దిలేసాడు. ఆ త‌ర్వాత విక్ర‌మ్ సిరితో ట‌చ్ చేసి చూడు.. అనిల్ రావిపూడితో రాజా ది గ్రేట్ మొద‌లుపెట్టేసాడు.

దాంతో త‌న సినిమా కోసం ర‌వితేజ ఇంకా టైమ్ తీసుకుంటాడ‌ని అర్థం చేసుకున్న చ‌క్రి.. ఇదే క‌థ‌ గోపీచంద్ కు చెప్పి ఒప్పించాడు. ఈ చిత్ర ఓపెనింగ్ కూడా జ‌రిగింది. ఈయ‌న‌ కెరీర్ కూడా ప్ర‌స్తుతం స్లోగా ఉంది. ఈ మ‌ధ్య వ‌ర‌స ప‌రాజ‌యాలు గోపీచంద్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సౌఖ్యం, జిల్ తో పాటు ఈ మ‌ధ్యే వ‌చ్చిన గౌత‌మ్ నందా కూడా గోపీచంద్ కు నిరాశ‌నే మిగిల్చింది. న‌వంబ‌ర్ లోనే ఆక్సీజ‌న్ విడుదల కానుంది. ఆర‌డుగుల బుల్లెట్ ఎప్పుడొస్తుందో తెలియ‌దు. ఇప్పుడు చక్రి సినిమా కూడా క‌మిట‌య్యాడు. మొత్తానికి ర‌వితేజ క‌థ‌తో గోపీచంద్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..?