ర‌వితేజ ఇంటిలిజెంట్ గా తపించుకొన్నాడు

ఎక్క‌డ్నుంచి త‌ప్పించుకున్నాడు అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీలో ఒక్కోసారి కొన్ని సినిమాలు ఒక‌రి చేతుల్లోంచి మ‌రో హీరో చేతుల్లోకి వెళ్లిపోతుంటుంది. ఆ సినిమాలు విడుద‌లై స‌క్సెస్ అయితే అరెరే మిస్ అయిపోయామే అని బాధ ప‌డ‌తారు. కానీ అదే సినిమా డిజాస్ట‌ర్ అయితే.. అది కూడా చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ అయితే.. హమ్మ‌య్యా బ‌తికిపోయాంరా బాబూ అనుకుంటారు. ఇప్పుడు ఇంటిలిజెంట్ సినిమాను చూసి ర‌వితేజ కూడా ఇలాగే ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే ఈ సినిమాను ముందు ర‌వితేజ‌తోనే ప్లాన్ చేసాడు వినాయ‌క్. అప్ప‌ట్లో కృష్ణ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ వినాయ‌క్ తో క‌లిసి ప‌ని చేయ‌లేదు మాస్ రాజా. దాంతో ఈ సినిమా కూడా కృష్ణ త‌ర‌హాలోనే కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని ముందు ర‌వితేజ‌కే క‌థ చెప్పాడు వినాయ‌క్.

ఆ టైమ్ లో రాజా ది గ్రేట్.. ట‌చ్ చేసి చూడు సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఈ ఆఫ‌ర్ ను సున్నితంగా తిర‌స్క‌రించాడు ర‌వితేజ‌. దాంతో సాయిధ‌రంతేజ్ సీన్ లోకి వ‌చ్చాడు. పాపం వినాయ‌క్ ను న‌మ్మి అడ్డంగా బుక్ అయిపోయాడు. అస‌లే వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న సాయి కెరీర్ కి కోలుకోలేని దెబ్బ ప‌డిపోయిందిప్పుడు. ఇన్నాళ్లూ సాయి సినిమాలు ఎలా ఉన్నా క‌నీసం ఓపెనింగ్స్ అయినా వ‌చ్చేవి. కానీ ఇప్పుడు అది కూడా లేదు. తొలిరోజు 2.5 కోట్ల షేర్ వ‌స్తే.. మూడు రోజుల‌కు క‌లిపి 3.4 కోట్ల షేర్ వ‌చ్చింది. ఇక వ‌చ్చేలా కూడా క‌నిపించ‌ట్లేదు. కానీ సినిమాను అమ్మింది మాత్రం 27 కోట్ల‌కు. అంటే ఇంటిలిజెంట్ ఎంత పెద్ద డిజాస్ట‌రో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి సినిమా కానీ ర‌వితేజ‌కు ప‌డుంటేనా మ‌నోడి కెరీర్ మ‌రింత దారుణంగా మారేది. అస‌లే ఈ మ‌ధ్య ట‌చ్ చేసి చూడు డిజాస్ట‌ర్ తో షాక్ ఇచ్చాడు మాస్ రాజా. అందుకే ఇప్పుడు ఇంటిలిజెంట్ ను చూసి బ‌తికిపోయాన్రా బాబూ అనుకుంటున్నాడు మాస్ రాజా.

User Comments