చిరంజీవి దారిలో ర‌వితేజ‌

Last Updated on by

ర‌వితేజ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రంటే అమితాబ్ అంటాడు.. తెలుగులో అంటే చిరంజీవి అంటాడు. ఇప్ప‌టికీ ఈయ‌న మెగాస్టార్ కు సూప‌ర్ ఫాలోయ‌ర్. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు మాస్ రాజా. అయితే ఈ సారి మాత్రం సినిమా క‌థ విష‌యంలో చిరంజీవిని ఫాలో అవుతున్నాడు ర‌వితేజ‌. త‌న కొత్త సినిమా క‌థ అప్ప‌ట్లో చిరు చేసిన ఓ క‌థ‌తో పోలి ఉంది. ర‌వితేజ ప్ర‌స్తుతం నేల‌టికెట్ సినిమాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం మే 25న విడుద‌ల కానుంది. తాజాగా నేల‌టికెట్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో ప‌దిమంది బాగుండాలి.. అందులో మ‌నం ఉండాలి అనుకునే టైప్ హీరో.

ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ ప‌రుల‌కు సాయం చేయాలి.. అంద‌ర్నీ ప్రేమించాలి అంటూ ఆ మ‌ధ్య స్టాలిన్ లో బాగా చూపించాడు చిరంజీవి. ముగ్గురికి సాయం చేయండి.. ఆ ముగ్గురు మ‌రో ముగ్గురు అంటూ బాగానే ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురు కాన్సెప్ట్ కాదు.. చుట్టూ ఎంత మంది ఉంటే అంత‌మందికి సాయం చేయ్ అనే కాన్సెప్ట్ తో వ‌స్తున్నాడు మాస్ రాజా. ఇదే క‌ళ్యాణ్ కృష్ణ చెప్పాల‌నుకుంటున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది దానికే ర‌వితేజ ఇమేజ్ ను అద్దేసాడు. జ‌గ‌ప‌తిబాబు ఇందులో విల‌న్. మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. చూడాలిక‌.. ఈ కాన్సెప్ట్ తో ర‌వితేజ ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో..? ఇప్పుడు ఈయ‌న విజ‌యం కూడా కీల‌క‌మే. ఎందుకంటే ట‌చ్ చేసి చూడు ఫ్లాప్ తో మ‌నోడు బాగా వెన‌క‌బ‌డిపోయాడు.

User Comments