ర‌వితేజ పని అయిపోయిందా

Last Updated on by

ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమా వ‌చ్చిందంటే ఖచ్చితంగా మినిమ‌మ్ క‌లెక్ష‌న్లు వ‌చ్చేవి. ఆయ‌న సినిమా ఎలా ఉన్నా.. ఉన్న స్టార్ ఇమేజ్ తో ఓపెనింగ్స్ భారీగా వ‌చ్చేవి. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి వ‌స్తోన్న ఫ్లాపుల‌తో ర‌వితేజ మార్కెట్ దారుణంగా ప‌డిపోయింది. ఇప్పుడు విడుద‌లైన నేలటిక్కెట్టు ప‌రిస్థితి మరీ ఘోరం. ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమా అంటే తొలిరోజే 5 కోట్ల‌కు పైగా షేర్ వ‌చ్చేది. గ‌తేడాది రెండేళ్ల గ్యాప్ తీసుకుని వ‌చ్చినా రాజా ది గ్రేట్ దాదాపు 6 కోట్ల షేర్ తీసుకొచ్చింది తెలుగు రాష్ట్రాల్లో.. ఇక ట‌చ్ చేసి చూడుతో ఆ రేంజ్ 4 కోట్ల‌కు ప‌డిపోయింది. ఇక ఇప్పుడు నేలటిక్కెట్టు తో మ‌రింత నేల‌కు ప‌డిపోయింది ర‌వితేజ మార్కెట్.

ఈ చిత్రం తొలిరోజు కేవ‌లం 3.47 కోట్ల షేర్ మాత్ర‌మే తీసుకొచ్చింది. ఈయ‌న కంటే నాని రేంజ్ ఇప్పుడు రెండింత‌లు ఉంది. రెండో రోజు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఇలాగే ఉంటే ట‌చ్ చేసి చూడును కూడా నేలటిక్కెట్టు దాటేస్తుందో లేదో అనే అనుమానం వ‌స్తుంది. ఈ ప‌రిస్థితి ఇలాగే సాగితే రానురాను ర‌వితేజ మార్కెట్ మ‌రింత ప‌డిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇది ఆగాలంటే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. తెరీ రీమేక్ ల‌తో ఖచ్చితంగా ర‌వితేజ హిట్లు అందుకోవాల్సిందే. లేదంటే ఎక్క‌డా మొద‌లెట్టాడో అక్క‌డే ఆగాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది మాస్ రాజాకు.

User Comments