నేల‌టికెట్.. ఒక్క విజిల్ కొట్టు..

Last Updated on by

నేల‌టికెట్.. ఈ పేరు విన‌గానే ముందుగా గుర్తొచ్చేది మాస్. ఓ సినిమా హిట్ కావాలంటే మాస్ కు న‌చ్చాల్సిందే. బి, సి సెంట‌ర్ల‌లో ఆడితేనే హిట్ట‌య్యే సినిమా కాస్తా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. అంత ప‌వ‌ర్ నేల‌టికెట్ కు ఉంటుంది. దాన్ని త‌క్కువ చేస్తే అంతే సంగ‌తులు. ఈ మాస్ వ్యాల్యూ.. నేల‌టికెట్ రేంజ్ ఏంటో ర‌వితేజ కంటే ఎవ‌రికీ బాగా తెలుసు చెప్పండి..? అందుకే ఇప్పుడు త‌న సినిమాకు ఇదే టైటిల్ పెట్టుకుని వ‌చ్చేసాడు ఈ హీరో. తాజాగా నేల‌టికెట్ టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత అర్థ‌మ‌వుతుంది సినిమా ఎంత మాస్ గా ఉండ‌బోతుందో అని..! సోగ్గాడే చిన్నినాయ‌నా.. రారండోయ్ వేడుక చూద్ధాం లాంటి సినిమాల త‌ర్వాత‌ క‌ళ్యాణ్ కృష్ణ కురసాల తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇది.

టీజ‌ర్ లో ఏమీ చూపించ‌లేదు కానీ మాస్ రాజా కారెక్ట‌ర్ ను మాత్రం బాగా ఎలివేట్ చేసాడు ద‌ర్శ‌కుడు. త‌న చుట్టూ ఉన్నోళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్లే వాడిగా ఇందులో ర‌వితేజ న‌టిస్తు న్నాడు. ఈ చిత్రంలో మ‌ళ‌యాల భామ మాళ‌విక శ‌ర్మ‌.. సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ట‌చ్ చేసి చూడు త‌ర్వాత మ‌రోసారి సీర‌త్ తో జోడీ క‌డుతున్నాడు మాస్ రాజా. ట‌చ్ చేసి చూడు ఫ్లాప్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ర‌వితేజకు నేల‌టికెట్ ఫ‌లితం కీల‌కంగా మారింది. మే 24న సినిమా విడుద‌ల కానుంది.

User Comments