నేల‌టికెట్.. ఆ క్రేజ్ ఎక్క‌డ మాస్ రాజా..?

Last Updated on by

ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమా వ‌స్తుందంటే ఆ ర‌చ్చే వేరు. వారం రోజుల ముందు నుంచే ఆ వైబ్రేష‌న్స్ క‌నిపించేవి. ఆ సినిమా ఎలా ఉన్నా కూడా ర‌వితేజ ఉన్నాడు కాబ‌ట్టి ఖచ్చితంగా ఆ క్రేజ్ అయితే క‌నిపించేది. చివ‌రికి రెండేళ్ళ త‌ర్వాత వ‌చ్చిన రాజా ది గ్రేట్ కు కూడా ఆ పాజిటివ్ వైబ్ క‌నిపించింది. కానీ ఇప్పుడు నేల‌టికెట్ విష‌యంలో మాత్రం అది క‌నిపించ‌డం లేదు. సినిమా విడుద‌ల ఇంకా నాలుగు రోజులు కూడా లేదు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం గురించి ఎక్క‌డా ఆ వైబ్రేష‌న్స్ క‌నిపించ‌డం లేదు. కార‌ణం తెలియ‌దు కానీ చాలా త‌క్కువ అంచ‌నాల‌తో వ‌స్తున్నాడు మాస్ రాజా. ఈ మ‌ధ్య కాలంలో తొలిసారి ర‌వితేజ సినిమా ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. మే 25న నేల‌టికెట్ విడుద‌ల కానుంది. పైగా ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాలా తెర‌కెక్కించాడు. రారండోయ్.. సోగ్గాడే లాంటి విజ‌యాల త‌ర్వాత ఈయ‌న నుంచి వ‌స్తోన్న సినిమా ఇది.

User Comments