ర‌వితేజ స‌ర‌స‌న త‌మ‌న్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాతో మ‌రోసారి జ‌ట్టు క‌ట్ట‌బోతున్నాడు ర‌వితేజ‌. ఆయ‌న కథానాయ‌కుడిగా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అదొక పీరియాడిక‌ల్ ఫ్యామిలీ డ్రామాతో తెర‌కెక్కుతున్న చిత్ర‌మ‌ని స‌మాచారం. అందులో త‌మ‌న్నా క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని తెలిసింది. మొన్న‌టివ‌ర‌కూ ఇందులో కూడా శ్రుతిహాస‌న్ న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగింది. కాగా తాజాగా త‌మ‌న్నా తెరపైకొచ్చింది. శ్రుతిహాస‌న్‌తో ప్ర‌స్తుతం `క్రాక్‌` చేస్తున్నాడు ర‌వితేజ. వెంట‌నే మ‌ళ్లీ శ్రుతినే రిపీట్ చేయ‌డం బాగోద‌ని ర‌వితేజ అండ్ టీమ్ నిర్ణ‌యించింద‌ట‌. దాంతో ర‌వితేజ‌కి త‌గిన క‌థానాయిక అని త‌మ‌న్నాని ఎంపిక చేశారు. స‌మ‌యానికి ఆమె కాల్షీట్లు కూడా ఖాళీగా ఉండ‌టంతో ఆమెనే ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. క్రాక్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే త్రినాథ‌రావు చిత్రం ప‌ట్టాలెక్క‌బోతోంది.