ర‌వితేజ అన్నీ మ‌రిచిపోయాడా..?

Last Updated on by

బాసూ.. మ‌న‌కు మెమోరీ లాసూ.. అంటూ కిక్ లో ఓ పాట పాడుకున్నాడు ర‌వితేజ‌. చూస్తుంటే ఈ పాట కావాల‌నే ఇప్పుడు కూడా పాడుకున్న‌ట్లు అనిపిస్తుంది. లేక‌పోతే మ‌రేంటి.. వ‌ర‌స‌గా రెండు భారీ డిజాస్ట‌ర్లు వ‌చ్చినా కూడా మాస్ రాజాలో మాత్రం ఆ టెన్ష‌న్స్ ఏం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. పైగా హాయిగా ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు కొడుకు.. కూతురుతో క‌లిసి బ్యాంకాక్ ట్రిప్ వెళ్లొచ్చాడు మాస్ రాజా. ఇక ఇప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చి.. శీనువైట్ల అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీతో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే యుఎస్ వెళ్లాల్సి ఉన్నా.. అనుకోని కార‌ణాల‌తో ఈ షెడ్యూల్ మ‌రో 15 రోజులు పోస్ట్ పోన్ అయింది. దాంతో ఇక్క‌డే మ‌రో షెడ్యూల్ పూర్తి చేస్తున్నాడు శీనువైట్ల‌.

ఇవ‌న్నీ ఇలా ఉంటే ర‌వితేజ మాత్రం గ‌త ఫ్లాపులు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.
రాబోయే సినిమాలు ఉన్నాయి క‌దా అనే కాన్ఫిడెన్స్ ఈయ‌న క‌ళ్ల‌లో క‌నిపిస్తుంది. నేల‌టికెట్ తో పాటు.. దీనికి ముందు వ‌చ్చిన ట‌చ్ చేసి చూడు కూడా క‌నీసం 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేని డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. దాంతో ర‌వితేజ ఇప్పుడు హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితుల్లోకి వ‌చ్చేసాడు. ఇప్పుడు కానీ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ తేడా కొడితే ర‌వితేజ ఎక్క‌డైతే మొద‌లుపెట్టాడో.. అక్క‌డే ఆగాల్సి వ‌స్తుందిప్పుడు. మ‌రక.. ఏం జ‌రుగుతుందో..? అన్న‌ట్లు ఈ చిత్రం త‌ర్వాత తెరీ రీమేక్ కూడా చేయ‌బోతున్నాడు ఈ హీరో.

User Comments