ర‌వితేజ ట‌చ్ చేస్తున్నాడు.. కానీ అవ్వ‌ట్లేదు..

రెండేళ్లు  గ్యాపిచ్చినా ర‌వితేజ ఇమేజ్ మాత్రం ఇంత కూడా త‌గ్గ‌లేద‌ని రాజా ది గ్రేట్ తో అర్థ‌మైపోయింది. ఈ చిత్రం 30 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. ఆ సినిమా ఉత్సాహంతోనే ట‌చ్ చేసి చూడు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అప్ప‌ట్లో రాజా ది గ్రేట్ ప‌నుల్లో ఉండి కొన్నాళ్లు షూటింగ్ కు బ్రేకిచ్చాడు ర‌వితేజ‌. ఇక ఇప్పుడు ఫుల్ గా ట‌చ్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు మాస్ రాజా. విక్ర‌మ్ సిరి అనే కొత్త ద‌ర్శ‌కుడు దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు. పోలీస్ స్టోరీ అంటే క‌చ్చితంగా యాక్ష‌న్ పార్ట్ ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే కాస్త కామెడీ ట‌చ్ ఇస్తున్నాడు ర‌వితేజ‌. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఈ మ‌ధ్యే ప్రీ లుక్ విడుద‌లైంది. ఈ లుక్ చూస్తుంటే నిజంగానే ఎవ‌డైనా ట‌చ్ చేస్తే వాడికి ప‌గిలిపోవ‌డం గ్యారెంటీ అనేలా ఉంది.

త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ర‌వితేజ‌, ముర‌ళీశ‌ర్మ‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు మాస్ రాజా. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లు. డిసెంబ‌ర్ లో షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి కానుక‌గా ట‌చ్ చేసి చూడును విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ట‌చ్ చేసి చూడు పండ‌క్కి రావ‌డం క‌ష్ట‌మే. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వరికి కానీ పూర్తి చేయ‌డం క‌ష్ట‌మంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దానికి చాలా కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. పైగా పండ‌క్కి ప‌వ‌న్, బాల‌య్య లాంటి స్టార్ హీరోలు కూడా వ‌స్తున్నారు. ఇలాంటి టైమ్ లో ర‌వితేజ కూడా కాస్త వెన‌క‌డుగు వేస్తున్నాడు. మొత్తానికి ర‌వితేజ బాగానే ట‌చ్ చేస్తున్నా.. అక్క‌డ మాత్రం ట‌చ్చింగులు లేవు.

User Comments