ర‌వితేజ కొత్త సినిమా `క‌న‌క‌దుర్గ‌`

మాస్ రాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా వి.ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `డిస్కోరాజా` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న ర‌వితేజ కు ఈ సినిమా అత్యంత కీల‌కం. ఇప్ప‌టికే మార్కెట్ డౌన్ పాల్ అయిన నేప‌థ్యంలో `డిస్కోరాజా`తో ఎలాగైనా హిట్ కొట్టి త‌న బ్రాండ్ ని నిల‌బెట్టుకోవాల్సి ఉంది. `డిస్కోరాజా` క‌థ కూడా రొటీన్ భిన్నంగానే ఉంటుంద‌ని యూనిట్ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. పైగా వి.ఐ ఆనంద్ త‌మిళ్ డైరెక్ట‌ర్ కావ‌డంతో సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని ర‌వితేజ కాన్పిడెంట్ గానే ఉన్నాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ కాన్సెంట్రేష‌న్ మొత్తం ఈ సినిమాపైనే ఉంది. కొత్త ఆఫ‌ర్లు వ‌స్తున్నా! ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

అయితే ఏడాదిన్న క్రితం నుంచి డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ తో మాస్ రాజా సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓ త‌మిళ్ సినిమా రీమేక్ చేద్దామ‌నుకున్నా! చివ‌రి నిమిష‌యంలో ఆనిర్ణ‌యం వెన‌క్కి తీసుకుని కొత్త క‌థ‌తో ముందెకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం విధిత‌మే. అయితే తాజాగా ఆ సినిమాకు `క‌న‌క‌దుర్గ` అనే టైటిల్ ను ఖ‌రారు చేసారు. ర‌వితేజ మాస్ ఇమేజ్ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సంతోష్ త‌న‌దైన శైలిలో ప‌క్కా మాస్ కంటెంట్తోనే తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని యూనిట్ వ‌ర్గాల నుంచి లీకైంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి టైటిల్స్ ను లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌కు మాత్ర‌మే పెట్టేవారు. తొలిసారి ర‌వితేజ‌ క‌న‌క‌దుర్గ టైటిల్ ను రిజిస్ట‌ర్ చేయించ‌డంతో అంత‌టా చ‌ర్చ‌కొస్తుంది.