రవితేజ‌-సంతోష్ శ్రీనివాస్ లేన‌ట్లే?

మాస్ రాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సినిమా `తేరి`ని రీమేక్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం..అటుపై క‌థను పూర్తిగా మార్చి కొత్త కంటెంట్ తో తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా సినిమా నిర్మించ‌డానికి ముందుకు రావ‌డంతో సినిమా భారీ స్పాన్ తోనే ఉంటుంద‌ని అంచ‌నాలున్నా. రేపోమాపో సినిమా సెట్స్కు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని బ‌లంగా వినిపించింది. అయితే సినిమాపై మ‌రోసారి నీలినీడ‌లు క‌మ్ముకున్న‌ట్లు తెలుస్తోంది. అస‌లు సినిమా తెర‌కెక్కుతుందా? లేక‌ క‌్యాన్సిల్ అయిందా? అనే సందేహాల న‌డుమ ఈ మిస్ట‌రీ ఓ కొలిక్కి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ర‌వితేజ ఉన్న ప‌రిస్థితుల్లో అటు క్రేజ్ దృష్ట్యా, ఇటు మార్కెట్ ప‌రంగా సినిమా చేయ‌డం రిస్క్ అని భావించి మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిన‌ట్లు వినిపిస్తోంది. వాస్త‌వానికి ఈ రూమ‌ర్ గ‌తంలో నే వైర‌ల్ అయింది కానీ, ఇప్పుడు నిర్మాణ వ‌ర్గం స‌న్నిహితుల నుంచి లీక‌వ‌డం సంచ‌ల‌న‌మ‌వుతోంది. దీనిపై నిర్మాణ సంస్థ అధికారికంగా స్పందించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తొంది. ప్ర‌స్తుతం ర‌వితేజ డిస్కోరాజా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Also Watch : Aadi Looks Stylish In Burra Katha