ర‌వితేజ వార‌సుడు హీరో అవ్వ‌డ‌ట‌

Last Updated on by

మాస్ మ‌హారాజా ర‌వితేజ వార‌సుడు మ‌హాధ‌న్‌ హీరో అవుతున్నాడంటూ సాగిన ప్ర‌చారంలో ఏమాత్రం నిజం లేదు. ఆ వార్త‌ల్ని న‌మ్మొద్ద‌ని ర‌వితేజ ఖండించారు. మావాడి వ‌య‌సు ఇంకా 11. చ‌దువుకుంటున్నాడు. అప్పుడే సినిమాల్లోకి రాడు అని ర‌వితేజ అన్నారు. అప్పుడే మావాడిపై రాసేశారు.. ఎక్క‌డో చ‌దివాను అని అన్నారు.

మొత్తానికి త‌న‌యుడి వ‌య‌సు హీరో అయ్యే వ‌య‌సు కాద‌ని ర‌వితేజ చెప్ప‌క‌నే చెప్పారు. అయితే అత‌డు హీరో అయిపోతున్నాడంటూ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అదంతా ఉత్తుత్తేన‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌హాధ‌న్ నా కొడుకు పాత్ర‌లో న‌టించాల్సింది. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంలో న‌టిస్తాడ‌ని అనుకున్నాం. అన్నీ రెడీ అయినా యూఎస్‌లో వ‌ర్క్ ప‌ర్మిష‌న్ రాక‌పోవ‌డంతో ఆగిపోవాల్సొచ్చింది. ప్ర‌స్తుతం స్ట‌డీస్‌లో బిజీగా ఉన్నాడు… అని ర‌వితేజ తెలిపారు. ఇదే చిత్రంలో ల‌య‌, త‌న కుమార్తె మ‌ద‌ర్-డాట‌ర్ పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని అన్నారు. బాలీవుడ్ లో న‌టిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు .. అవ‌కాశాలొచ్చినా త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, అందుకే న‌టించ‌లేద‌ని అన్నాడు. వైట్ల బాలీవుడ్ లో చేస్తానన్నారు క‌దా? అని ప్ర‌శ్నిస్తే… స్క్రిప్టు కుదిరితే ఎందుకు చేయం? అన్నీ కుద‌రాలి అని అన్నారు. ఇది చేస్తాను.. అది చేయ‌ను అనేదేం ఉండ‌దు. కుదిరితే చేసేస్తానంతేన‌ని ర‌వితేజ త‌న‌దైన స్టైల్లో అనేశారు.

User Comments