భామ‌లతో మాస్‌రాజా స‌య్యాట‌

Last Updated on by

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టించిన `నేల టిక్కెట్‌` ఈనెల 25న అత్య ంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇటు ర‌వితేజ‌కు, అటు క‌ళ్యాణ్‌కృష్ణ‌కు చాలా ఇంపార్టెంట్‌. మాస్ రాజా కోల్పోయిన ప్ర‌భ‌ను తిరిగి వెన‌క్కి తేచ్చేందుకు శ‌త‌ధా ప్ర‌య‌త్నిస్తున్నాడు. రాజా ది గ్రేట్ త‌ర‌వాత మ‌రో బంప‌ర్‌హిట్ కొట్టే ప్ర‌య‌త్న‌మే ఇది. అలానే క‌ల్యాణ్ కృష్ణ రెండు విజ‌యాల త‌ర‌వాత క‌చ్ఛితంగా హ్యాట్రిక్ అందుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఆ క్ర‌మంలోనే చిత్ర‌యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పూర్తి బిజీగా ఉన్నారు.

ఈ సినిమా రిలీజ్ అవ్వ‌గానే త‌దుప‌రి ప్రాజెక్ట్ `అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని` కోసం ర‌వితేజ బిజీ అయిపోతున్నార‌ట‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ రెండు నెల‌ల పాటు సుదీర్ఘంగా అమెరికాలో జ‌ర‌గ‌నుంది. అంతేకాదు ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న ముగ్గురు క‌థానాయిక‌లు ఆడిపాడ‌నున్నార‌ని యూనిట్ చెబుతోంది. క్రేజీ గాళ్‌ శ్రుతిహాస‌న్ ఓ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, స‌న్న‌జాజి సోయ‌గం ఇలియానా రెండో నాయిక‌గా ఎంపికైంది. మూడో నాయిక‌ను ఎంపిక చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే క్రేజీ గాళ్ అనూ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంది. ఆ క్ర‌మంలోనే ఇలియానా పేరు తెర‌పైకి వ‌చ్చింది. శ్రుతిహాస‌న్‌, ఇలియానాల‌తో పాటు, మ‌రో అంద‌గ‌త్తెకు ఈ చిత్రంలో స్కోప్ ఉంది. ఆ క్ర‌మంలోనే

మూడో నాయిక ఎవ‌ర‌న్న‌ది స‌స్పెన్స్‌గా మారింది. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ముచ్చ‌ట‌గా ముగ్గురు భామ‌ల‌తో రొమాన్స్ చేస్తుండ‌డం చూస్తుంటే ఈ సినిమాలో గ్లామ‌ర్‌కి కొద‌వ లేకుండా వైట్ల ప్లాన్ చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

User Comments