ఫ‌స్ట్ లుక్‌: విన‌య విధేయ రామా

Last Updated on by

రామ్ చ‌ర‌ణ్ మాసా.. క్లాసా? బోయ‌పాటి క్లాసా మాసా? ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ పోస్టర్. ఆ ఇద్ద‌రూ అస‌లు క్లాస్ అంటే ఒప్పుకోవ‌డం క‌ష్టం. రామ్‌చ‌ర‌ణ్ ఎంత ప‌క్కా మాస్ స్టారో `రంగ‌స్థ‌లం` రిజ‌ల్ట్ చెప్పింది. క్లాస్ కంటెంట్‌తో వ‌చ్చిన `ధృవ‌` రిజ‌ల్టుతో పోలిస్తే `రంగ‌స్థ‌లం` బాక్సాఫీస్ వ‌ద్ద‌ డ‌బుల్ ధ‌మాకా మోగించింది. అందుకే మాస్‌ని దృష్టిలో ఉంచుకుంటేనే ఏ సినిమా అయినా వ‌సూళ్ల ప‌రంగా బొనాంజా రిజ‌ల్టుని ఇస్తుంద‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌.

రామ్‌చ‌ర‌ణ్ ఏంటి.. బోయ‌పాటిని ఎందుకు ఎంచుకున్నాడు? అన్న వాళ్ల‌కు దాని వెన‌క ఉన్న చాలా క్యాలిక్యులేష‌న్స్ కార‌ణ‌మ‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స‌రైనోడు లాంటి ఊర మాస్ సినిమాతో అటు ఉత్త‌రాదినా, యూట్యూబ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నాడు బోయ‌పాటి. స‌రైనోడు హిందీ వెర్ష‌న్‌కి డ‌బ్ చేసి యూట్యూబ్‌లో వ‌దిలితే అద్భుతమైన వ్యూస్‌తో దూసుకెళ్లింది. అందుకే అప్పుడు చ‌ర‌ణ్‌కి బోయ‌పాటి క‌థ కూడా క‌నెక్ట‌య్యింది. అలా ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన ఆర్‌సి 12 టైటిల్‌ ఫ‌స్ట్ లుక్ నేడు రిలీజ్ చేశారు. విన‌య విధేయ రామా టైటిల్‌ని ఫిక్స్ చేసి పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. చ‌ర‌ణ్ అభిమానుల‌కు మ‌రో మాస్ యాక్ష‌న్ విజువ‌ల్ ఫెస్ట్ సంక్రాంతికి షురూ అయిన‌ట్టేన‌ని ఈ పోస్ట‌ర్ చెబుతోంది. ఒక‌టి కాదు.. రెండు క‌త్తుల్ని అందుకుని శ‌త్రువుపై లంఘిస్తున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. అంటే దీన‌ర్థం భారీ యాక్ష‌న్ తో ఒళ్లు గ‌గుర్పొడిచే విన్యాసాలు ఈ చిత్రంలో చూడ‌బోతున్నామ‌ని సింబాలిక్‌గా ఈ పోస్ట‌ర్ క‌నిపిస్తోంది. `విన‌య విధేయ రామా`
టీజ‌ర్‌ నవంబ‌ర్ 9న ఉద‌యం 10.25 గంట‌ల‌కు రిలీజ్ కానుంద‌ని, అలానే 2019 సంక్రాంతికి రిలీజ్ ఖాయ‌మైన‌ట్టేన‌ని ప్ర‌క‌టించారు. `విన‌య విధేయ రామా` ప్రీరిలీజ్ బిజినెస్‌లోనూ దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments