చ‌ర‌ణ్ సంక్రాంతి కానుక‌

Last Updated on by

రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి RC12 రిలీజ్ జ‌న‌వ‌రి 12న‌ ఫిక్స‌యిన‌ట్టేనా? అంటే అవున‌నే స‌మాచారం. రిలీజ్‌ తేదీని అన‌ధికారికంగా లాక్ చేశారు. అయితే దీనిని అధికారికంగా ప్ర‌క‌టించేందుకు రెడీ అవుతున్నార‌ని తెలిసింది. 2019 సంక్రాంతిని మెగా పండుగ‌గా డిక్లేర్ చేస్తూ త్వ‌ర‌లోనే ఆ ఒక్క ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని మెగాభిమానులు భావిస్తున్నారు.

ఇప్ప‌టికైతే 60శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మిగ‌తా షూటింగ్‌ని వేగంగా పూర్తి చేసి, నిర్మాణానంత‌ర ప‌నులు సైమ‌ల్టేనియ‌స్‌గా కానిచ్చేస్తార‌ట‌. బోయ‌పాటి నుంచి మ‌రో మ్యాసివ్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ఫ్యాన్స్ ఆశించ‌వ‌చ్చు. రంగ‌స్థ‌లం త‌ర్వాత మ‌రో బంప‌ర్ హిట్ కొట్టి స‌త్తా చాటాల‌ని చ‌ర‌ణ్ ఉవ్విళ్లురుతున్నారు. అందుకు సంక్రాంతి సెల‌వులు క‌లిసొస్తాయ‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. అయితే సంక్రాంతి బ‌రిలో వెంకీ- వ‌రుణ్‌తేజ్ సినిమా, టాలీవుడ్‌లో మ‌రిన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. పోటీ ఉంటుంది కాబ‌ట్టి చ‌ర‌ణ్‌- బోయ‌పాటి సినిమాలో కంటెంట్ అన్నిటినీ డిసైడ్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

User Comments