భూముల‌ రీ-రిజిస్ట్రేషన్లు నిషేధం

లావాదేవీలు, రిజిస్ట్రేషను చేసేప్పుడు, రిజిస్ట్రేషన్‌ నిబంధన 50 ప్రకారం రిజిస్టరింగ్‌ అధికారికి దస్తావేజులోని ఆస్తుల హక్కులను, వాటిలోని అభ్యంతరాలను అంటే అమ్మకందారునికి ఆస్తిహక్కులు ఎలా సంభవించాయో లేక హక్కులు ఎలా పొందగలిగారో, ఆ ఆస్థి అమ్మందారునికి గాని, అభ్యంతరాలతను పరిగణలోకి తీసుకోవడానికి గానీ అధికారమి వ్వలేదు. రిజిస్టరింగ్‌ అధికారి పార్టీల మధ్య లావాదేవీలను ఎవిడెన్స్‌ చట్ట ప్రకారం రిజిస్టర్‌ చేసి నమోదు చేయగల అధికారిగాని, పత్రంలోని హక్కులను పరిశీలించే పరిధి ఇవ్వలేదు. కానీ రిజిస్ట్రేషన్‌ రూల్‌ నెం 26 ప్రకారం దస్తావేజును దాఖలు పరిచిన వ్యక్తి అతనా, కాదా అన్న విషయాన్ని, దాఖలు పరిచిన వ్యక్తిని దస్తావేజులోని సంతకం పెట్టిన వ్యక్తిని సాక్షుల ద్వారా విచారించే అధికారి మాత్రమే కలిగి ఉంటాడు. దస్తావేజులు నకిలీ పత్రమా, అతని ముందు దస్తావేజులు దాఖలు పరచిన వ్యక్తుల వారా, కాదా అన్న విషయాలను కూడా నిర్ధారించుకునే సౌకర్యం కానీ రిజిస్ట్రేషన్‌ నిబంధన 26 ద్వారా కల్పించారే కని ఈ దాఖలు పరచిన అన్ని విషయాల నూ నిర్ధారించే ఎలాంటి బాధ్యత రిజిస్ట్రార్‌కు చట్టపరంగా అనుమతించలేదు.

ఆస్తుల బదలాయింపు చట్టంలోని లోటుపాట్లను గమనించిన కొందరు స్వార్థపరులు అమాయకపు ప్రజలను మోసగించి ఒకే ఆస్థిని వివిధ కొనుగోలుదారులకు అమ్మకానికి పెడుతున్నారు. దీంతో మొదట రిజిస్ట్రేషన్‌ పొందిన వ్యకి నష్టపోయే ప్రమాదం పొంచిఉంది. ఆస్తిహక్కుల విషయంలో ఎన్నో వ్యాజ్యాలు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి. ఆస్తుల అమ్మకం విషయంలో స్పష్టత రావడానికి అవసరమైన చట్టబద్దమైన కొత్త విధానాన్ని రిజిస్ట్రేషన్‌ చట్టం 1908లోని సెక్షన్‌ 22బి ప్రతిపాధించబడింది. ఈనేపథ్యంలో రీ-రిజిస్ట్రేషన్లు (ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు వేరువేరు రిజిస్ట్రేషన్లు చేయడం) నిషేదిస్తూ చట్ట సవరణ చేయడం జరిగింది. 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈచట్టాన్ని తీసుకు రావడంతో అక్కడ సత్ఫలితాలు రావడాన్ని పరిశీలించిన ప్రభుత్వం, ఇటువంటి నిబంధన సివిల్‌ కోర్టుల హక్కులను భంగపర్చరాదనన్న నేపథ్యంలోనే రీ-రిజిస్ట్రేషన్‌ చట్టాన్ని సభలో సవరించడం జరిగింది.