పెళ్లెప్పుడ‌వుతుంది బాబోయ్‌!

Last Updated on by

లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. అది దూల‌తీర్చేస్తుంద‌ని స్పీడ్ డైరెక్ట‌ర్‌ పూరి జ‌గ‌న్నాథ్ చాలాసార్లు చెప్పాడు. మాట్లాడే ప్ర‌తి ప్రెస్‌మీట్‌లో పూరి చెప్పే ఫిలాస‌ఫీలో నిజాయితీ క‌నిపిస్తుంది. పూరి ఎంతో అనుభ‌వంతో చెప్పే ప్ర‌తి మాటా మీడియా వాళ్ల‌కు కాస్తంత న‌చ్చుతాయి. ఎందుకంటే అందులో క‌చ్ఛితంగా ప్రాక్టికాలిటీ అనేది ఉంటుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు దెబ్బ‌మీద దెబ్బ తిన్న పూరి ఏం చెప్పినా దానిని అనుభ‌వంగా భావించి అంద‌రూ గౌర‌విస్తుంటారు.

ఇప్పుడు పూరి చెప్పిన ఆ మాట‌ను ప‌లువురు సెల‌బ్రిటీల‌కు అన్వ‌యించినా అది అచ్చంగా స‌రిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికిప్పుడు టాలీవుడ్‌లో కొంద‌రు హీరోల స‌న్నివేశం అలానే ఉంది. ఇప్ప‌టికే పెళ్ల‌యిన హీరోలు కొంద‌రు అయితే, పెళ్లికాని ప్ర‌సాదులు మ‌రికొంద‌రు. వీళ్లంద‌రిదీ స‌మంత లైఫ్‌లా స‌క్సెస్‌ఫుల్ లైఫ్ అనుకోవ‌డానికి లేనేలేదు. సారీ! స‌మంత లైఫ్‌లోనూ బోలెడ‌న్ని మెలోడ్రామాలు ఉన్న సంగ‌తి తెలిసినా, ఇప్ప‌టికైతే సామ్ కెరీర్ ప‌రంగా, వ్య‌క్తిగ‌త లైఫ్ ప‌రంగా ఏ చికాకులు లేకుండానే ముందుకు సాగుతోంది. దాంతో పోలిస్తే ఇప్పుడున్న కొంద‌రు హీరోల వ్య‌క్తిగ‌త జీవితంలో డైలెమ్మా కాస్త ఇబ్బందిక‌ర‌మైన‌దే. ఉదాహ‌ర‌ణ‌కు ఇప్ప‌టికిప్పుడు ఓ ఇద్ద‌రు యువ‌హీరోల వ్య‌క్తిగ‌త జీవితంలో డ‌ల్‌డ్ర‌మ్స్ ప్ర‌భావం కెరీర్‌పైనా అంతా ఇంతా లేదు. ఆల్మోస్ట్ సినిమాలు వ‌దిలేసి ఖాళీగా కూర్చున్నారు. వైఫ్‌తో గొడ‌వ‌లు వ‌గైరా వ‌గైరా అని కొంద‌రు అంటే, అబ్బే అదంతా పుకార్ అని సామాజిక మాధ్య‌మాల్లో స‌ద‌రు హీరోలు ఖండించిన సంద‌ర్భాలున్నాయి. (ఈ ఆర్టిక‌ల్‌లో ఎథిక‌ల్‌గా ఓ ఇద్ద‌రు హీరోల పేర్లు రాయ‌లేదు.. వ్య‌క్తిగ‌త జీవితం కాబ‌ట్టి) కోట్ల‌కు కోట్లు కూడ‌గ‌డితే ఏంటి? వ‌్య‌క్తిగ‌త జీవితంలో ఇబ్బందులు కెరీర్‌ని నాశ‌నం చేయ‌డంపై ప‌లువురు ప‌లు ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. అదంతా అటుంచితే కొంద‌రు హీరోల లైఫ్ పూర్తి విభిన్నంగా ఉండ‌డంపైనా స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. కొంద‌రు హీరోలు అసాధార‌ణ స్టార్‌డ‌మ్ సంపాదించి వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా ప‌రిపూర్ణంగా లేక‌పోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సిరీస్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ గుర్తింపు పొందినా, ఇప్ప‌టికీ 38 ఏళ్లు వ‌చ్చేసినా ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని అభిమానులు క‌ల‌త చెందుతున్నారు. ప్ర‌భాస్ ఇలా లేట్ చేస్తే బెండ ముదిరినా, బ్ర‌హ్మ‌చారి ముదిరినా.. అన్న సామెత‌ను గుర్తు చేస్తూ ఫ్యాన్స్ కాస్తంత ఇబ్బందినే ఫీల‌వుతున్నారు. మ‌రోవైపు ప్ర‌భాస్ మాత్రం నా వ్య‌క్తిగ‌త జీవితం- నా ఇష్టం అన్న తీరుగానే ఉంటున్నాడు. నిశ్చితార్థం అయితే అప్పుడు చెబుతాను ఎవ‌రిని పెళ్లి చేసుకుంటానో.. అనేది కూడా ప్ర‌భాస్ ఖ‌రాకండిగా చెబుతున్న మాట‌! మ‌రో హీరో నితిన్ సీనియ‌ర్ బ్యాచిల‌ర్‌గా టాలీవుడ్‌లో వెలిగిపోతున్నాడు. అత‌డు ఇదివ‌ర‌కూ త‌న‌తో రెండు సినిమాల్లో వ‌రుస‌గా న‌టించిన మేఘా ఆకాష్‌తో ల‌వ్‌లో ప‌డ్డాడ‌ని, అటుపై పెళ్లాడేస్తున్నాడ‌ని ప్ర‌చారం సాగినా దానిపై అప్‌డేట్ అన్న‌దే లేదు. నిత్యామీన‌న్‌తో వ‌రుస‌గా నటించిన‌ప్పుడు నితిన్‌పై ఈ పుకార్లు వ‌చ్చాయి. అయితే ఆ ఇద్ద‌రితోనూ నితిన్ మిస్‌. ఇక ఇంట్లో పెళ్లాడేయాల్సిందేన‌న్న పోరు ఉంద‌ని నితిన్ సోద‌రి నిఖితారెడ్డి ఇదివ‌ర‌కూ చెప్పారు. అయినా నితిన్ ఎందుక‌నో ఆల‌స్యం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కెరీర్ ప‌రంగా మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాల్సిన స‌న్నివేశం నితిన్‌కి ఉంది. ఇక టాలీవుడ్‌లో వేరొక టాప్ డైరెక్ట‌ర్ క్రిష్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి తామ‌ర‌తంప‌ర‌గా వార్త‌లొచ్చాయి. అయితే వృత్తిగ‌త జీవితం వేరు.. వ్య‌క్తిగ‌త జీవితం వేరు. లైఫ్ ఎప్పుడూ దూల తీర్చేస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్ల‌య్యాక బ్యాలెన్స్ చేయ‌లేక కొంద‌రు.. పెళ్ల‌వ్వ‌క బ్యాలెన్స్ చేయ‌లేని మ‌రికొంద‌రు… అదే లైఫ్ అంటే!! ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసిన‌వాడే మొన‌గాడు.. అస‌లైన హీరో అని నిర్వ‌చిస్తుంది లోకం!

User Comments