అఖిల్ సినిమా అందుకే ఆగిందా..?

Last Updated on by

ఎప్పుడో రెండు నెల‌ల కిందే అఖిల్ మూడో సినిమా క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. వెంకీ అట్లూరితో సినిమాకు ముహూర్తం పెట్టి కూడా నెల రోజులు దాటేసింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు. అడిగితే అనివార్య కార‌ణాలు అంటున్నారు. ఇప్పుడు ఆ అనివార్య కార‌ణాలేంటో బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్ర షూటింగ్ లండ‌న్ లోనే ఎక్కువ‌గా ప్లాన్ చేస్తున్నాడు వెంకీ అట్లూరి. దానికోసం చాలా మంది యూనిట్ యుకే వెళ్ల‌నున్నారు. ఒకేసారి అంద‌రికి వీసా రావ‌డం అంటే మాట‌లు కాదు. హీరో.. ద‌ర్శ‌కుడికి వ‌స్తే స‌రిపోదు క‌దా.. అంత‌మందికి వీసాలు రావ‌డం కాస్త ఆల‌స్య‌మయ్యే ప‌నే. ఇప్పుడు ఇదే అఖిల్ సినిమాకు అడ్డుగా మారింది. వీసాల ఆల‌స్యంతోనే షూటింగ్ కూడా ఆల‌స్యం అవుతుంది. తొలిప్రేమ స‌మ‌యంలో కూడా వెంకీకి ఇదే జ‌రిగింది.

తొలిప్రేమ షూటింగ్ కూడా చాలా భాగం లండ‌న్ లోనే జ‌రిగింది. దాంతో అప్పుడు హైద‌రాబాద్ షెడ్యూల్ ముందు చేసుకుని ఆ త‌ర్వాత లండ‌న్ వెళ్లాడు వెంకీ. అయితే అఖిల్ సినిమా మాత్రం 70 శాతం అక్క‌డే జ‌ర‌గ‌బోతుంది. అందుకే ముందు అక్క‌డే పూర్తిచేస్తే ఇక్క‌డికి వ‌చ్చి మిగిలిన పోర్ష‌న్ షూట్ చేయొచ్చ‌నే ప్లాన్ లో ఉన్నాడు వెంకీ అట్లూరి. అన్నీ కుదిర్తే జూన్ చివరి వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రికీ వీసాల స‌మ‌స్య‌లు కూడా క్లియ‌ర్ అయిపోయాయ‌ని తెలుస్తుంది. అది కూడా పూర్తైతే అఖిల్ సినిమాను మూడంటే మూడే నెల‌ల్లో పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ద‌స‌రాకు అఖిల్ మూడో సినిమా విడుద‌ల చేయాల‌నేది వెంకీ ప్లాన్. ఇప్పుడు అస‌లే అఖిల్ వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్నాడు. చేసిన రెండు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా ఆడ‌లేదు. దాంతో ఇప్పుడు వెంకీ సినిమాపైనే ఆశ‌ల‌న్నీ ఉన్నాయి.

User Comments