బ‌న్నీని వ‌ణికిస్తున్న మ‌హేష్.. చ‌ర‌ణ్..!

Last Updated on by

ఇండ‌స్ట్రీకి ఇప్పుడు టైమ్ భ‌లే న‌డుస్తుంది. సంక్రాంతికి స్టార్ హీరోలు హ్యాండిచ్చినా.. మ‌ధ్య‌లో ఎవ‌రూ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వ‌క‌పోయినా రంగ‌స్థ‌లం వ‌చ్చిన టైమ్ బాగున్న‌ట్లుంది. ఆ సినిమా ఇప్ప‌టికే 190 కోట్ల‌కు పైగా గ్రాస్.. 120 కోట్ల‌కు చేరువ‌గా షేర్ వ‌సూలు చేసి నాన్ బాహుబ‌లిలో అన్ని రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇక రంగ‌స్థ‌లం ఇచ్చిన ఊపును కొన‌సాగిస్తూ భ‌ర‌త్ అనే నేను కూడా రికార్డుల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నాడు. ఈ సినిమా కూడా తొలి వారంలోనే 75 కోట్ల షేర్.. 130 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. రెండో వారం కూడా పెద్ద‌గా సినిమాలు లేక‌పోవ‌డంతో ఖచ్చితంగా 100 కోట్ల షేర్ సాధిస్తుంద‌నే న‌మ్ముతున్నారు నిర్మాత‌లు. ఇదిలా ఉంటే.. ఈ రెండు సినిమాల దూకుడు ఇప్పుడు బ‌న్నీకి భ‌యాన్ని.. ధైర్యాన్ని రెండింటినీ ఒకేసారి ఇస్తుంది. నా పేరు సూర్య‌తో నెక్ట్స్ రాబోయే పెద్ద హీరో బ‌న్నీనే. మే 4న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌నోడు అస‌లే వ‌రస విజ‌యాల‌తో జోరు మీదున్నాడు.

డిజే కూడా యావ‌రేజ్ టాక్ తోనే 70 కోట్ల‌కు పైగా షేర్ సాధించింది. అది హిట్ ఖాతాలో వేయ‌లేం కానీ బ‌న్నీ మార్కెట్ రేంజ్ ఏంటో చూపించిన సినిమా ఇది. ఇలాంటి టైమ్ లో బ‌న్నీకి కానీ స‌రైన సినిమా ప‌డితే ఈజీగా 100 కోట్ల మార్క్ అందుకుంటాడు. కానీ అది ప‌డేవ‌ర‌కి వేచి చూడ‌టమే. అది నా పేరు సూర్య అయితే ఇండ‌స్ట్రీ పంట పండిన‌ట్లే. రంగ‌స్థ‌లం.. భ‌ర‌త్ ఇచ్చిన ఉత్సాహంలో తాను కూడా రికార్డుల ప‌ని ప‌ట్టాలి అనే క‌సితో వ‌స్తున్నాడు అల్లు వార‌బ్బాయి. కానీ ధైర్యం ఎంతుందో భ‌యం కూడా అంతే ఉంది. టాక్ కానీ తేడాగా వ‌స్తే ప్రేక్ష‌కులు అస్స‌లు క‌నిక‌రించ‌రు. నిర్ధాక్ష‌ణ్యంగా తిప్పి కొడుతున్నారు. ఎనిమిది విజ‌యాలున్న నానికే కృష్ణార్జున యుద్ధంతో డిజాస్ట‌ర్ త‌ప్ప‌లేదు. దాంతో బ‌న్నీ టెన్ష‌న్ లోనే ఉన్నాడిప్పుడు. మ‌రి.. ఏం జ‌రుగుతుందో..? అస‌లు సినిమా మొద‌ల‌వ్వడానికి మ‌రో వారం రోజులు మాత్రమే టైమ్ ఉంది సుమీ..!

User Comments