చిరుకు అల్లుడు ముఖ్యం కాదట..!

Last Updated on by

తేజ్ ఐ ల‌వ్ యూ ఆడియో వేడుక‌కు చిరంజీవి వ‌స్తున్నాడని తెలియ‌గానే.. మేన‌ల్లుడి కోసం మెగాస్టార్ వ‌స్తున్నాడు.. అబ్బా ఎంత ప్రేమ అల్లుడంటే అనుకున్నారంతా. కానీ కాస్త ఆలోచించే వాళ్లు మాత్రం అక్క‌డ సీన్ మ‌రోలా ఉంద‌ని ముందే అర్థం చేసుకున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుక‌కు చిరు రావ‌డానికి కార‌ణం మెగా మేన‌ల్లుడు కానే కాదు. ఆయ‌న కూడా ఓ కార‌ణం అంతే కానీ మెయిన్ రీజ‌న్ మాత్రం కేఎస్ రామారావు. అప్ప‌ట్లో ఆయ‌న నిర్మాణంలో చిరంజీవి చేసిన రాక్ష‌సుడు.. ఛాలెంజ్.. అభిలాష‌.. మ‌ర‌ణ‌మృదంగం లాంటి సినిమాలు చిరంజీవిని సుప్రీంహీరో స్థాయి నుంచి మెగాస్టార్ గా మార్చేసాయి.

ఆ కృత‌జ్ఞ‌త ఇప్ప‌టికీ చిరంజీవిలో ఉంది. అందుకే కేఎస్ రామారావు పిల‌వ‌గానే త‌న సైరా షూటింగ్ ను త్వ‌ర‌గా ముగించుకుని మ‌రీ ఈ వేడుక‌కు వ‌చ్చాడు మెగాస్టార్. అదే విష‌యం స‌భాముఖంగా కూడా చెప్పాడు చిరంజీవి. తాను ఈ వేడుక‌కు వ‌చ్చి సాయిధ‌రంతేజ్ కోసం కానేకాదు.. కేవ‌లం రామారావు కోసమంటూ మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు చిరు. ముందు కేఎస్.. ఆ త‌ర్వాతే మేన‌ల్లుడు అంటూ నిజాల‌న్ని ఒప్పేసుకున్నాడు ఈ హీరో. మొత్తానికి ఏదేమైనా సాయిధ‌రంతేజ్ కు చిరంజీవి ల‌క్కీ. ఆయ‌న వ‌చ్చి ఆడియో విడుద‌ల చేసిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ బాగానే ఆడింది. ఇప్పుడు ఈయ‌న ఫ్లాపుల్లో ఉన్నాడు ఇలాంటి టైమ్ లో చిరు వ‌చ్చాడు. మ‌రి తేజ్ కూడా ఆడుతుందేమో చూడాలి..!

User Comments