దీపిక సినిమాలు మానేస్తుందా..?

Last Updated on by

పెళ్లైతే సినిమాలు మానేస్తారా..? అది కూడా బాలీవుడ్ లో..? అస‌లు వాళ్లు పెళ్లి చేసుకున్నా కూడా చేసుకోన‌ట్లే ఉంటారు క‌దా..! వాళ్ల‌కు ఒక‌రి ప‌ర్మిష‌న్ కూడా అవ‌స‌రం లేదాయే..! ఇలాంటి టైమ్ లో దీపిక ప‌దుకొనే సినిమాలు ఎందుకు మానేస్తున్న‌ట్లు..? ఇప్పుడు అభిమానుల్లో కూడా ఇదే అనుమానం వ‌స్తుంది. ఒక‌ప్ప‌ట్లా ఇప్ప‌డు దీపిక ప‌దుకొనే సినిమాలు ఒప్పుకోవ‌డం లేదు.. చేయ‌డం లేదు కూడా. ఇంకా చెప్పాలంటే ప‌ద్మావ‌తి త‌ర్వాత దీపిక ఒక్క సినిమాకు కూడా సైన్ చేయ‌లేదంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. కానీ ఇదే నిజం. అప్పుడెప్పుడో సైన్ చేసిన షారుక్ ఖాన్ జీరోతోనే బిజీగా ఉంది ఈ భామ‌. ఇక ఇర్ఫాన్ ఖాన్ హీరోగా విశాల్ భ‌ర‌ద్వాజ్ తో చేయాల్సిన సినిమా ప్ర‌స్తుతానికి ఇర్ఫాన్ ఆరోగ్యం దృష్ట్యా ఆగిపోయింది. ఇలాంటి టైమ్ లో పెళ్లి కార‌ణం గానే ఇప్పుడు సినిమాలు చేయ‌డం లేద‌నే వార్త‌లు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

ర‌ణ్ వీర్ సింగ్ ను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే దీపిక సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇది కాద‌ని.. ఆమె మెడ‌నొప్పితో బాధ ప‌డుతుంద‌ని.. అది త‌గ్గేవ‌ర‌కు చేయ‌ద‌ని మ‌రికొంద‌రి వాద‌న‌. ఇందులోనూ నిజం లేదు కేవ‌లం క‌థ‌లు న‌చ్చ‌కే ఏ సినిమా ఒప్పుకోవ‌డం లేదని దీపిక వ‌ర్గం చెబుతున్న మాట‌. కాస్త ఆలోచిస్తే ఇందులో నిజం క‌నిపిస్తుంది. ఎందుకంటే కొన్నేళ్లుగా దీపిక చేస్తోన్న సినిమాలు కేవ‌లం క‌థా బ‌లం ఉన్న‌వే. రెగ్యుల‌ర్ మాస్ సినిమాల‌కు దూర‌మై చాలా కాల‌మైంది ఈ భామ‌. అందులోనూ ప‌ద్మావ‌తి లాంటి సినిమా త‌ర్వాత తిక్క క‌థ‌లు చేస్తే విమ‌ర్శ‌లు వ‌స్తాయి. అందుకే కాస్త ఆల‌స్యం అయినా ప‌ర్లేద‌నీ మంచి క‌థ‌ల కోసం చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈమె మెప్పు పొందే క‌థ‌లు సిద్ధం చేసే ద‌ర్శ‌కులు ఎక్క‌డ ఉన్నారో..?

User Comments