తేజ ఎందుకు తప్పుకొన్నాడు..!

Last Updated on by

అనుకున్న‌దే జ‌రిగింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి తేజ త‌ప్పుకున్నాడు. అస‌లు ఈ కాంబినేష‌న్ అనౌన్స్ అయిన‌పుడే భ‌లేగా ఉందికా కాంబినేష‌న్ అనిపించింది. కానీ ముందు నుంచి అంద‌ర్లోనూ ఒక‌టే అనుమానం ఉంది. బాల‌య్య‌తో తేజ‌కు ఎలా కుదుర్తుంది..? ప‌్ర‌తీ చిన్న విష‌యానికి తేజ సీన్ పెద్దది చేస్తాడు. మ‌రోవైపు క్లారిటీ లేక‌పోతే కాఫీ కూడా తాగ‌డు బాల‌య్య. ఈ ఇద్ద‌రికి ఎలా సింక్ అవుతుంది..? పైగా అక్క‌డున్న‌ది పెద్దాయ‌న జీవిత క‌థ‌.. అలాంటప్పుడు బాల‌య్య కాంప్ర‌మైజ్ అవుతాడా అని అంద‌ర్లోనూ ఒక‌టే అనుమానాలు వ‌చ్చాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి.

ఊహించి న‌ట్లే ఈ చిత్రం నుంచి తేజ త‌ప్పుకున్నాడు. కార‌ణం కూడా బాల‌య్య‌తో ఈయ‌న‌కు క్రియేటివ్ డిఫెరెన్సులు రావ‌డ‌మే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం సినిమా మొద‌లుపెట్టిన రోజే అర్థ‌మైంది కూడా. నిర్మాత అయిన బాల‌య్య ఈ చిత్రం సంక్రాంతికి వ‌స్తుందంటే.. తేజ మాత్రం ద‌స‌రాకు వ‌స్తుంద‌ని చెప్పాడు. అంటే అప్పుడే ఇద్ద‌రికి క్లారిటీ లేద‌ని అర్థ‌మైంది. ఇప్పుడు తేజ ఈ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలోకి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు రాఘవేంద్ర‌రావ్ ను తీసుకోవాల‌ని చూస్తున్నాడు బాల‌య్య‌. ఎన్టీఆర్ గురించి ద‌ర్శ‌కేంద్రుడి కంటే ఎవ‌రికి ఎక్కువ తెలుసు..? అందుకే ఈ చిత్రం తీసుకెళ్లి రాఘ‌వేంద్రుడి చేతుల్లో పెడుతున్నాడు బాల‌కృష్ణ‌. మ‌రి.. ఈ కాంబినేష‌న్ ఎలా వ‌ర్క‌వుట్ అవుతుందో..?

User Comments