నా నువ్వే… రేపే వచ్చేస్తోంది

Last Updated on by

వ‌ర‌స ఫ్లాపుల‌తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్ బాగా వెన‌క‌బ‌డిపోయింది. ఎన్నో అంచ‌నాలు.. ఆశ‌లు పెట్టుకున్న ఎమ్మెల్యే కూడా డిజాస్ట‌ర్ కావ‌డంతో నంద‌మూరి వార‌సుడి కెరీర్ ఎటూ కాకుండా పోతుందిప్పుడు. ప్ర‌స్తుతం ఈయ‌న నా నువ్వే సినిమాతో వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఆడియోకు రెస్పాన్స్ బాగానే వ‌చ్చింది. యాడ్ ఫిల్మ్ మేక‌ర్ జ‌యేంద్ర తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ రామ్ మేనేజ‌ర్ మ‌హేష్ కోనేరు నిర్మించాడు. త‌మ‌న్నా హీరోయిన్. ఇవ‌న్ని ఇలా ఉండ‌గా ఈ చిత్ర ర‌న్ టైమ్ పై ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తుంది.

ఓ వైపు ఇండ‌స్ట్రీలో మూడు గంట‌ల సినిమా హ‌వా న‌డుస్తుంటే.. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ మాత్రం కేవ‌లం గంట 58 నిమిషాల‌తో వ‌స్తున్నాడు. ఈ చిత్ర నిడివి రెండు గంట‌ల కంటే త‌క్కువ అని తెలుసుకుని ఇండ‌స్ట్రీ కూడా షాక్ అవుతుంది ఇప్పుడు. సింపుల్ అండ్ బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీని వీలైనంత త‌క్కువ టైమ్ లో చెప్ప‌డానికి వ‌స్తున్నాడు జ‌యేంద్ర‌. ఇదే ఇప్పుడు సినిమాకు ప్ల‌స్ కానుంది. త‌క్కువ ర‌న్ టైమ్ ఉంటే క్రిస్పీగా క‌థ‌ను చెప్పొచ్చు. అందుకే ఈ చిత్రంపై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు క‌ళ్యాణ్ రామ్. నా నువ్వే ట్రైలర్ ను రేపే (16/05/18) విడుదల చేయనున్నారు. మొత్తానికి.. నా నువ్వేతో క‌ళ్యాణ్ కెరీర్ గాడిన ప‌డుతుందో లేదో..?

User Comments