కొర‌టాల ట్విట్ట‌ర్ యుద్ధం..

ర‌చ‌యిత‌ల‌కు ఆయుధాల‌తో ప‌నిలేదు. వాళ్లేం చెప్పాల‌నుకుంటున్నారో తూటాల్లాంటి మాట‌ల‌తోనే చెప్పేయ‌గ‌ల‌రు.

ఇప్పుడు కొర‌టాల కూడా ఇదే చేస్తున్నాడు. అస‌లు వివాదాల‌కు దూరంగా ఉండే ఈయ‌న ఈ మ‌ధ్య కాలంలో కాస్త యాక్టివ్ అయ్యాడు.

కావాల‌నే సోష‌ల్ మీడియాలో కొన్ని ఆస‌క్తి క‌ర‌మైన ట్వీట్స్ పెడుతున్నాడు. ఆ మ‌ధ్య రాజకీయాల‌పై ట్వీటేసాడు కొర‌టాల‌. ఇప్పుడున్న రాజ‌కీయాలు ఎప్పటికి మారేనో అంటూ సెటైర్ వేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఇక ఆ త‌ర్వాత హైద‌రాబాద్ రోడ్ల ప‌రిస్థితిపై కూడా త‌న‌దైన శైలిలో మాట్లాడాడు. ఇప్పుడు విద్యావ్య‌వ‌స్థ‌పై నోరు విప్పాడు కొర‌టాల‌.

ఏపీలో వ‌ర‌స‌గా విధ్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న త‌రుణంలో ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేసాడు కొర‌టాల శివ‌.

మ‌ళ్లీ హాయిగా చ‌దువుకునే రోజులు ఎప్పుడొస్తాయో.. మ‌న ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్ ను మార్చాల్సిన టైమ్ వ‌చ్చింది అంటూ ట్వీటేసాడు కొర‌టాల‌.

ఈయ‌న చేసిన ట్వీట్ చిన్న‌దే అయినా అందులోనే చాలా అర్థం ఉంది. ఇప్పుడున్న విద్యావ్యవ‌స్థ‌లో చాలా లొసుగులు ఉన్నాయంటూ చెప్ప‌క‌నే చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.

హాయిగా చ‌ద‌వుకునే రోజు ఎప్పుడొస్తుందో అంటే ఇప్పుడున్న చ‌దువుల్లో హాయి లేద‌నే అర్థం. నిజంగానే ఇప్పుడు అది లేదు కూడా..! వ్యాపారం మోజులో ప‌డి ఎప్పుడో చ‌దువును కూడా బిజినెస్ గా  మార్చేసారు.

ఇక ఇప్పుడు కొర‌టాల వ‌ర‌స‌గా ట్వీట్లు వేయ‌డం వెన‌క మ‌రో కార‌ణం కూడా ఉంది. ఈయ‌న ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే నేను సినిమా చేస్తున్నాడు.

ఇది పొలిటిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. దాన్ని లైమ్ లైట్ లో ఉంచ‌డానికి తాను కూడా ఇలాంటి రెస్పాన్సిబుల్ ట్వీట్స్ చేస్తున్నాడు.

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లు.. అటు సినిమా.. ఇటు ట్వీట్స్ రెండూ క‌వ‌ర్ అవుతున్నాయి. ఎంతైనా కొర‌టాల మామూలోడు కాదు..!

Follow US