పూరీకి కొడుకే ఆయుధం

ఇప్పుడు ఏ స్టార్ హీరోల డేట్స్ కోసం పాకులాడాల్సిన ప‌నిలేదు. వాళ్లు వీళ్లు అంటూ ఎదురుచూపులు చూడాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట్లోనే ఓ హీరో ఉన్నాడిప్పుడు. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా తెర‌పై చూపించి త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకోడానికి పూరీ జ‌గ‌న్నాథ్ కు ఇంత కంటే మంచి అవ‌కాశం రాదేమో..? ఇప్పుడు వాళ్ల కోసం వీళ్ల కోసం చూడ‌కుండా కొడుకుతోనే అన్ని ప్ర‌యోగాలు చేయొచ్చు. ఎవ‌రైనా తన‌ను ఔట్ డేటెడ్ అన్నారో వాళ్ల‌తోనే అప్ డేటెడ్ అనిపించుకోవ‌చ్చు. ఈ ఛాన్స్ ఇప్పుడు పూరీ చేతుల్లోనే ఉంది. దానికి ఆయుధం ఆకాష్ పూరీ.

అవును.. ఆయ‌న కొడుకే ఇప్పుడు పూరీకి ఆయుధం. తొలి బాణంగా మెహ‌బూబాను వ‌దులుతున్నాడు పూరీ. మొన్న‌టి వ‌ర‌కు మాఫియా అంటూ తిరిగిన పూరీ.. కొడుకు సినిమాకు వ‌చ్చేస‌రికి ప్రేమ‌క‌థ‌తో వ‌స్తున్నాడు. అది కూడా ఇండోపాక్ బ్యాక్ డ్రాప్ లో. త‌ర్వాతి సినిమాను కూడా కొడుకుతోనే ప్లాన్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అంటే ఇక‌పై వ‌ర‌స‌గా కొడుకుతోనే సినిమాలు చేయ‌డానికి ఫిక్సైపోయాడు పూరీ. ఇవి కానీ హిట్టైతే త‌న‌ను తాను కొత్త‌గా ప‌రిచ‌యం చేసుకోడానికి కొడుకు కంటే ఆయుధం మ‌రోటి ఉండ‌దు. అందుకే ఇప్పుడు ఆకాష్ లోనే త‌న‌కు కావాల్సిన హీరోను చూసుకుంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి పూరీని త‌న కొడుకు కొత్త‌గా ప‌రిచ‌యం చేస్తాడో లేదో చూడాలి..!

User Comments