రామోజీతో రాజ‌మౌళి గొడ‌వ‌.. నిజ‌మేనా..?

Last Updated on by

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న వార్త‌.. ట్రెండ్ అవుతున్న వార్త కూడా ఇదే. పాలు నీళ్ల‌లో ఐదేళ్లు క‌లిసున్న వాళ్లు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయార‌ని తెలుస్తుంది. డ‌బ్బు బాస్.. ఎలాంటి వాళ్ల‌నైనా మార్చేస్తుంది. పైసామే ప‌ర‌మాత్మ అని ఊరికే అన్నారా..? ఇప్పుడు రామోజీరావు.. రాజ‌మౌళి మ‌ధ్య వివాదాలు రావ‌డానికి ఈ డబ్బే కార‌ణం అని తెలుస్తుంది. ఇంతకీ విష‌యం ఏంటంటే.. బాహుబ‌లి సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ ఆర్ఎఫ్సీలోనే చేసాడు రాజ‌మౌళి. అప్ప‌ట్లో ఈయ‌న‌కు ఫుల్ ప్రీడ‌మ్ ఇచ్చాడు రామోజీరావు. క‌నీసం త‌న స్టాఫ్ ను కూడా అలో చేయ‌ని విధంగా ఆర్ఎఫ్సీని కొన్నేళ్ల పాటు క‌బ్జా చేసాడు రాజ‌మౌళి. దానికి ప్ర‌తిఫ‌లంగా అప్ప‌ట్లో ఈటీవీకే బాహుబ‌లి రెండు సినిమాల హక్కులు ఇవ్వాల‌ని అనుకున్నాడు రాజ‌మౌళి అని వాళ్ళ టీం స‌భ్యుల నుంచే వినిపించిన మాట‌. అయితే త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో కానీ ఆ హ‌క్కులు మా టివికి వెళ్లిపోయాయి.

పైగా కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూష‌న్ కూడా రామోజీరావుకు ఇస్తాన‌ని చెప్పి రాజ‌మౌళి ఇవ్వ‌లేద‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. వీటిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ అక్క‌డ్నుంచే ఈ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తుంది. అయితే గొడ‌వ‌లు ఉండ‌కూడ‌ద‌ని రామోజీ రావుకు రావాల్సిన మొత్తం అప్పుడే రాజ‌మౌళి క్లియ‌ర్ చేసాడ‌ని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ అద‌న‌పు లెక్క‌లు అంటూ ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 90 కోట్లు రాజ‌మౌళికి ఈటీవీ పెద్దాయ‌న పంపిచాడ‌ని.. అది కూడా ఆర్కా మీడియా క‌ళ్లు తిరిగాయ‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు రాజ‌మౌళి కూడా అల్యూమీనియం ఫ్యాక్ట‌రీ ద‌గ్గ‌ర రెండు ఎక‌రాలు లీజుకు తీసుకున్నాడు. అక్క‌డే ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ సినిమాకు సంబంధించిన వ‌ర్కులు న‌డ‌వ‌బోతున్నాయని తెలుస్తుంది. దీన్నిబ‌ట్టి నిజంగానే రామోజీ, రాజ‌మౌళికి చెడిన‌ట్లు క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌చ్చు. వాళ్ల బంధం బాగుంటే ఇప్పుడు రాజ‌మౌళికి ఇలా లీజు క‌ష్టాలు ఉండేవి కావు క‌దా.. ఎంచ‌క్కా వెళ్లి అత్తారింట్లో షూటింగ్ చేసుకున్న‌ట్లు ఆర్ఎఫ్సీలోనే ప‌ని కానిచ్చేవాడు క‌దా..!

User Comments