చ‌ర‌ణ్ అసహనానికి కారణం

Last Updated on by

ఈ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్ లో చాలా మార్పు వ‌చ్చింద‌ని.. ఒక‌ప్ప‌ట్లా ఈయ‌న కోపంగా లేడ‌ని.. మీడియాతో కానీ అభిమానుల‌తో కానీ మెగా వార‌సుడు చాలా కూల్ గా ఉంటున్నాడ‌ని తెలుస్తుంది. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి.. బిహేవియ‌ర్ ను బ‌ట్టి అది తెలిసిపోతుంది. అయితే చాలా రోజుల త‌ర్వాత మ‌రోసారి చ‌ర‌ణ్ కోపంగా క‌నిపించాడు. అది కోపం కూడా కాదు.. అస‌హ‌నం అనాలేమో..? ఏం చేయ‌లేక త‌మ బాధ‌ను చెప్పుకోవ‌డం అంటారు దాన్ని. ఇప్పుడు నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో చ‌ర‌ణ్ ఇదే చేసాడు. స్టేజ్ పైకి వ‌చ్చిన వెంట‌నే మామ అల్లు అర‌వింద్ కు పంచ్ వేసాడు చ‌ర‌ణ్. కాంట్ర‌వ‌ర్సీ లేకుండా మామ ఏం చేయ‌డ‌ని.. మ‌ళ్లీ ఇప్పుడు కొత్త‌దానికి తెర‌లేపాడ‌ని చెప్పాడు చ‌ర‌ణ్. అక్క‌డ్నుంచే త‌న స్పీచ్ మొద‌లు పెట్టాడు ఈ హీరో.

క‌రెప్ష‌న్ లేని ఇండ‌స్ట్రీ ఏదైనా ఉందా అంటే అది కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీ మాత్ర‌మే అని చెప్పాడు చ‌ర‌ణ్. పొద్దున్న ఐదింటికి లేచి.. జిమ్ కు వెళ్లి ఆ త‌ర్వాత షూటింగ్ కు వెళ్లి.. రాత్రి గంట మాత్ర‌మే కుటుంబంతో గ‌డిపి మ‌ళ్లీ పొద్దున్నే లేచి షూటింగ్ కు వెళ్తాం. ఇదంతా చేసేది మేం ప్రేక్ష‌కుల కోస‌మే అది మీరు అర్థం చేసుకుంటే చాలు.. ఇందులో క‌రెప్ష‌న్ ఎక్క‌డుంది చెప్పండి అంటూ నేరుగా ప్రేక్ష‌కుల్నే అడిగాడు మెగా వార‌సుడు. ఈయ‌న మాట‌ల్లో అస‌హ‌నం క‌నిపిస్తుంది. ఎందుకు ప్ర‌తీ ఒక్క‌రు ఇండ‌స్ట్రీని టార్గెట్ చేస్తున్నారో అనే బాధ క‌న‌బ‌డుతుంది. మొత్తానికి ఈ మ‌ధ్య కొన్ని మీడియా సంస్థలు చేసిన ప‌నికి అంతా ఇప్పుడు స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌స్తుంది.

User Comments