సైరా లీక్స్.. భారీ ప్లాన్..!

Last Updated on by

సైరా సినిమాలో చిరంజీవి ఫ‌స్ట్ లుక్ ఎలా ఉంటుందో అనే స‌స్పెన్స్ కు తెర‌ప‌డి అప్పుడే రోజు గడిచిపోయింది. చ‌డీ చ‌ప్పుడు లేకుండా అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్విట్ట‌ర్ నుంచి ఫోటోస్ విడుద‌ల చేసాడు. అప్పుడు అది షాకింగ్ గా అనిపించినా.. బిగ్ బి లాంటి వ్య‌క్తి అంత గుడ్డిగా ఎలా లీక్ చేసాడో అని అప్ప‌టికి అనిపించినా.. దాని వెన‌క ఉన్న ప్లాన్ తెలుసుకున్న త‌ర్వాత ఎవ‌రికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే అంత మాస్ట‌ర్ ప్లాన్స్ ఉన్నాయి అక్క‌డ‌. సైరా పిక్స్ అమితాబ్ తోనే విడుద‌ల చేయించ‌డం వెన‌క భారీ ప్లానే ఉంది మెగా బుర్ర‌లో. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మ‌న‌కు ఎక్కువ‌.. ఇక్క‌డ ఫ్యాన్స్ ఆస‌క్తిగా వేచి చూస్తారు. కానీ సైరా అనేది తెలుగు సినిమా మాత్ర‌మే కాదు.. హిందీలోనూ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అన్ని ఇండ‌స్ట్రీల‌పై న‌మ్మ‌కంతోనే ఏకంగా 200 కోట్ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. అడిగినంత బ‌డ్జెట్ పెడుతున్నాడు రామ్ చ‌ర‌ణ్.

మ‌రి ఒక్క భాష‌లో ప్ర‌మోష‌న్ చేస్తే ఇంత వసూలు చేయ‌డం అసాధ్యం. అందుకే నేష‌న‌ల్ వైడ్ ప్ర‌మోష‌న్ ఇప్ప‌ట్నుంచే మొద‌లు పెట్టారు చిత్ర‌యూనిట్. అమితాబ్ ట్విట్ట‌ర్ నుంచి గానీ ఫోటోస్ విడుద‌లైతే ఇండియా మొత్తం చూస్తారు. ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ ఫాలోయింగ్ చాలా ఉన్నారు. ఇప్పుడు ఈయ‌న విడుద‌ల చేసిన పిక్స్ కాబ‌ట్టి ఖచ్చితంగా ఇండియ‌న్ వైడ్ గా ట్రెండ్ అవుతాయి ఈ పిక్స్. దానివ‌ల్ల తెలుగులో ఇలాంటి సినిమా ఒక‌టి రూపొందుతుంద‌ని.. అందులో అమితాబ్ న‌టిస్తున్నాడ‌ని నేష‌న‌ల్ వైడ్ గా ప్ర‌మోష‌న్ వ‌స్తుంది. అందుకే పిక్స్ త్వ‌ర‌గానే విడుద‌లైనా కూడా దానివెనక ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్ కూడా అంతే రేంజ్ లో ఉంది. అది సంగ‌తి.. లేదంటే ఊరికే ఏమీ తెలియ‌కుండానే అమితాబ్ ఈ స్టిల్స్ విడుద‌ల చేయ‌డు క‌దా..!

User Comments