ఆ డైరెక్టర్ పతనానికి కారణం ఆమెనేనా..!

Last Updated on by

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు ఓ ద‌ర్శ‌కున్ని చూసి అంటోన్న మాట ఇది. ఒక‌ప్పుడు ఆయ‌న చేసిన సినిమాలేంటి..? ఇప్పుడు ఆయ‌న నుంచి వ‌స్తోన్న సినిమాలేంటి..? ఆయ‌న సినిమాలో హీరో అంటే ర‌ఫ్ అండ్ ట‌ఫ్ గా ఉంటాడు. డైలాగుల‌ను డైన‌మైట్ల‌లా పేల్చ‌డం ఈయ‌న‌కు అలవాటు. ఆయ‌న పెన్ ప‌వ‌ర్ కు ఎంత‌టి హీరో అయినా స‌రెండ‌ర్ అయిపోవాల్సిందే. బ్యాంకాక్ బీచ్ లో క‌థ‌లు రాసినా.. విశాఖ‌ప‌ట్నంలో క‌థ‌లు రాసినా.. ఈ ద‌ర్శ‌కుడు మ‌న‌సు పెడితే అద్భుతాలే జ‌రిగేవి. కానీ ఇదంతా గ‌తం. ఇప్పుడు ఆయ‌న ఫ్లాప్ డైరెక్ట‌ర్.. అట్ట‌ర్ ప్లాప్ డైరెక్ట‌ర్. ఇంకా మాట్లాడితే డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్.

ఇలాంటి సినిమాలు చేయ‌డం కంటే మానేయ‌డం మంచిది అని ఆయ‌న అభిమానులే అంటున్నారు. అంత‌గా దిగ‌జారిపోయాడు స‌ద‌రు ద‌ర్శ‌కుడు. దానికి కార‌ణం ఓ మాజీ హీరోయిన్. అప్ప‌ట్లో ఆమె స్టార్ హీరోలంద‌రి సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్ గా కుమ్మేసిన ఆ పంజాబీ కుడి.. త‌ర్వాత ఈ ద‌ర్శ‌కున్ని ప‌ట్టుకుంది. ఎప్పుడైతే ఆమె ఈయ‌న జీవితంలోకి వ‌చ్చిందో అప్ప‌ట్నుంచే ఆయన జాత‌కం కూడా మారిపోయింది. అదృష్టం పోయి దుర‌దృష్టం అంటుకుంది. ఒక్క హిట్ కూడా లేక పాపం ఆయ‌న తిక్క‌చూపులు చూసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. చివ‌రికి వార‌సుడికి కూడా హిట్ ఇచ్చుకోలేని దారుణ‌మైన ప‌రిస్థితికి దిగ‌జారిపోయాడు ఆ ద‌ర్శ‌కుడు.

ఈయ‌న రీసెంట్ సినిమా చూసిన త‌ర్వాత ఎప్పుడైతే ఆ హీరోయిన్ ను వ‌దిలేస్తాడో అప్పుడే ఈయ‌న‌కు హిట్లు వ‌స్తాయిరా.. అంత‌వ‌ర‌కు రావు అంటూ అభిమానులు కూడా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసారు. కానీ ఆయ‌న మాత్రం ఇప్ప‌టికీ ఆ హీరోయిన్నే కావాలంటున్నాడు. ఆమెను ఏకంగా ప్రొడ‌క్ష‌న్ టీంలో భాగం చేసాడు. హీరోయిన్ గా ఉన్న‌పుడు ల‌క్ష‌ల్లో తీసుకున్న ఆమె.. ఇప్పుడు పారితోషికంగా కోట్లు తీసుకుంటుంది. ఇదంతా స‌ద‌రు ద‌ర్శ‌కుడి చ‌నువు వ‌ల్లే. మ‌రి ఈమె ఆయ‌న్ని ఎప్పుడు వ‌దిలేస్తుందో.. ఆయ‌న మ‌ళ్లీ ఎప్పుడు గాడిన ప‌డ‌తాడో చూడాలి..!

User Comments