పిక్‌టాక్‌: రెడ్ హాట్ బికినీ

Last Updated on by

వేడెక్కించే బికినీ లుక్‌తో షాకివ్వ‌డం ఇలియానాకు కొత్తేమీ కాదు. ఇటీవ‌లే ఫిజీ దీవుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపికై అటుపై ప్ర‌చారం ప్రారంభించిన ఇలియానా అక్క‌డ అంద‌మైన లొకేష‌న్ల‌లో అదిరిపోయే ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోషూట్ల నుంచి కొన్ని వేడెక్కించే ఫోటోల‌ను అప్పుడ‌ప్పుడు అభిమానుల‌కు షేర్ చేస్తోంది. రీసెంటుగా ఇలియానా ఫిజీ దీవుల‌ ప్ర‌చార వీడియో రిలీజై అభిమానుల్ని ఆక‌ట్టుకుంది.

ఇదిగో లేటెస్టుగా ఆ ఫోటోషూట్‌లోంచి మ‌చ్చుతున‌క లాంటి ఫోటో ఇది. ఇల్లూ ఎరుపు రంగు బికినీలో స‌డెన్ స‌ర్‌ప్రైజ్‌నిచ్చింది. టూపీస్‌లో ఇలియానా అంద‌చందాల్ని అద్భుతంగా ఎలివేట్ చేసింది ఈ ఛాయాచిత్రం. ఆ క‌ళ్ల‌కు బ్లాక్ క‌ల‌ర్ అద్దాలు పెట్టుకుని ఆ సీవ్యూ లేక్ లో ఎంజాయ్ చేస్తోందిలా. ప్రియుడు ఆండ్రూ నీబోన్ ఫోటోగ్ర‌ఫీలోని క‌ళాత్మ‌క యాటిట్యూడ్ ఈ ఫోటోలో ఎలివేట్ అయ్యింది. ఫిజీ టూరిజం ఇలియానా ప్ర‌చారంతో మ‌రింత హుషారెత్తిపోతోంది. ఇలియానా ప్ర‌స్తుతం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు ఫిజీ ప్ర‌చారం హోరెత్తిస్తోంది.

User Comments