బాలీవుడ్ కోసం క‌సిక‌సిగా రెజీనా

Regina affair sai dharam tej

స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని ఎన్నో ఆశ‌ల‌తో టాలీవుడ్ కి అడుగు పెట్టిన రెజీనా కు టైమ్ ఏ మాత్రం క‌లిసి రాలేదు. సోసోగా కొన్ని సినిమాల‌కే ప‌రిమిత‌మైంది. అటు కోలీవుడ్ లోనూ అదే ప‌రిస్థితి. టాలీవుడ్ లో ఫెయిలైనా అక్క‌డైనా రాణిస్తోంద‌ని భావించారు. కానీ వ‌ర్కౌట్ కాలేదు. వెక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో పార్టీ, క‌ల్ల‌పార్ట్, సెవ‌న్ సినిమాల్లో న‌టిస్తున్నా! అవి హిట్ అయితే గానీ వాటి స‌త్తా ఏంటో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో అక్క‌డే క‌ష్ట‌మేన‌ని ముందుగానే గ్ర‌హించిన అమ్మ‌డు బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. వాస్త‌వానికి అక్క‌డ ఇప్ప‌టికే `ఏక్ ల‌డ‌కీకో ఐసాలాహో` అనే సినిమాలో న‌టించింది. కానీ ఆ చిత్రం అంత‌గా గుర్తింపునివ్వ‌లేదు.

అయితే పొగొట్టుకున్న చోట‌నే రాణించ‌ల‌న్న క‌సితో ముంబైలో తిష్ట వేసి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం 18 అనే సినిమాలో న‌టిస్తోంది. తాజ‌గా మ‌రో రెండు ఛాన్సులు ఒడిసిప‌ట్టుకుందిట‌. సౌత్ లో ఫెయిలైన నేప‌థ్యంలో నార్త్ ను మాత్రం వ‌దిలిపెట్టేది లేద‌ని ఆమె స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది. ప‌రాజ‌యం ఎన్నో విష‌యాలు నేర్పుతుంది. ఎవ‌రి స‌క్సెస్ కి అయినా తొలి మెట్టు ప‌డాల్సింది అక్క‌డ నించే కదా. మ‌రి అక్క‌డైనా స‌క్సెస్ అవ్వాల‌ని ఆశిద్దాం.