ఏం రెచ్చిపోయిందిరా బాబూ..!

Last Updated on by

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత మంది హీరోలు అవ‌కాశాలు ఇచ్చినా రెజీనాకు అదృష్టం మాత్రం క‌లిసిరావ‌డం లేదు. ఒక‌ట్రెండు హిట్లు ఉన్నాయి.. పైగా అమ్మాయిగారు హాట్ హాట్ గా కూడా ద‌ర్శ‌న‌మిస్తారు కానీ ఎందుకో మ‌రి రెజీనాకు అవ‌కాశాలే త‌గ్గుముఖం పట్టాయి. అస‌లు తెలుగులో ఈమెను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేసారు. చిన్న హీరోల‌తోనే స‌ర్దుకుపోయి న‌టిస్తున్నా.. వాళ్లు కూడా చిన్న‌చూపు చూస్తున్నారిప్పుడు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాట వ‌ర‌స ఆఫ‌ర్లు అందుకుంటుంది రెజీనా. కానీ తెలుగులో మాత్రం ఈ భామ‌కు మొండిచేయే క‌నిపిస్తుంది. దాంతో చేసేదేం లేక చివ‌రి అస్త్రం అందాల ఆయుధాన్నే న‌మ్ముకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఎండ‌లో ఒడియాలు ఆర‌బోసిన‌ట్లు.. కెమెరాల‌కు అందాలు ఆరబోస్తుంది.

 
ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా అందాల‌ను కెమెరాల‌కు పూర్తిగా అరువిచ్చేస్తుంది రెజీనా. తాజాగా మిస్ట‌ర్ చంద్ర‌మౌళి సినిమాలో గౌత‌మ్ కార్తిక్ తో ఓ సినిమాలో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అందులో రెజీనా అందాల ఆర‌బోత చూసి అంతా షాక్ అవుతున్నారు. బికినీ టాప్ తో పాటు అదిరిపోయే హాట్ కాస్ట్యూమ్స్ తో ర‌చ్చ చేసిందంతే. ఇన్నాళ్లూ స్టిల్స్  మాత్ర‌మే ఉన్న పాట ఇప్పుడు వీడియో విడుద‌లైంది. ఇందులో మొద‌ట్లోనే బికినీతో నీటిలోంచి అలా వ‌స్తుంటే.. అమ్మో చూసినోళ్ల గుండెలు జారిపోవ‌డం ఖాయం. మొత్తానికి మునిగిపోతున్న కెరీర్ నావ‌ను ఒడ్డుకు చేర్చుకోడానికి అవ‌స‌ర‌మైన ప్ర‌తీ ఆయుధం వాడేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌.

User Comments