పాపం రెజీనాను చూడండి బాబు

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత మంది హీరోలు అవ‌కాశాలు ఇచ్చినా రెజీనాకు అదృష్టం మాత్రం క‌లిసిరావ‌డం లేదు. ఒక‌ట్రెండు హిట్లు ఉన్నాయి.. పైగా అమ్మాయిగారు హాట్ హాట్ గా కూడా ద‌ర్శ‌న‌మిస్తారు కానీ ఎందుకో మ‌రి రెజీనాకు అవ‌కాశాలే త‌గ్గుముఖం పట్టాయి. అస‌లు తెలుగులో ఈమెను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేసారు. చిన్న హీరోల‌తోనే స‌ర్దుకుపోయి న‌టిస్తున్నా.. ఇప్పుడు వాళ్లు కూడా చిన్న‌చూపు చూస్తున్నారు. ప్ర‌స్తుతం నాని నిర్మిస్తున్న అ.. సినిమాలో విల‌న్ గా న‌టిస్తుంది రెజీనా. దాంతో పాటు ఈ మధ్యనే తమిళ్ సినిమా మిస్టర్ చంద్రమౌళి టాకీ పార్ట్ పూర్తి చేసుకొంది.Regina Cassandra Missing Tollywood Hot Photoshoot

త‌మిళ‌నాట వ‌ర‌స ఆఫ‌ర్లు అందుకుంటుంది రెజీనా. కానీ తెలుగులో మాత్రం ఈ భామ‌కు మొండిచేయే క‌నిపిస్తుంది. దాంతో చేసేదేం లేక చివ‌రి అస్త్రం అందాల ఆయుధాన్నే న‌మ్ముకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఎండ‌లో వడియాలు ఆర‌బోసిన‌ట్లు.. కెమెరాల‌కు అందాలు ఆరబోస్తుంది. ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా అందాల‌ను కెమెరాల‌కు పూర్తిగా అరువిచ్చేస్తుంది రెజీనా.Regina Cassandra Missing Tollywood Hot Photoshoot

మొన్న కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. సినిమా ఫ్లాపైనా కూడా రెజీనా అందాల్ని మాత్రం అదిరిపోయేలా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ ఆ సినిమా రెజీనాకు పెద్ద‌గా హెల్ప్ కాలేదు. ఈ మ‌ధ్యే మ‌రోసారి హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. హాట్ గా బెడ్ రూమ్ లో కూర్చుని మ‌త్తు క‌ళ్ళ‌తో ఊపిరి తీసేసింది ఈ ముద్దుగుమ్మ‌.Regina Cassandra Missing Tollywood Hot Photoshoot

మొత్తానికి మునిగిపోతున్న కెరీర్ నావ‌ను ఒడ్డుకు చేర్చుకోడానికి అవ‌స‌ర‌మైన ప్ర‌తీ ఆయుధాన్ని వాడేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ఇలా అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీసారి త‌న అందాల‌నే ఆయ‌ధంగా వాడేస్తుంది ఈ భామ‌. క‌నీసం ఇవి చూసైనా ఏదో ఓ ద‌ర్శ‌కుడు క‌రుణించ‌క‌పోతాడా అని ఆశ‌. మ‌రి ఈ ఆశ‌ను ఎవ‌రు నెర‌వేరుస్తారో..?Regina Cassandra Missing Tollywood Hot Photoshoot

 

User Comments