`బిగ్ బాస్` హోస్ట్ రేణుదేశాయ్‌?

Last Updated on by

నీతోనే డ్యాన్స్.. అంటూ రియాలిటీ షోలో జ‌డ్జిగా మెప్పించారు రేణు దేశాయ్. అలాగే ఇష్కావాలా జిందాబాద్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే గాకుండా నిర్మాత‌గానూ కొన‌సాగారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి నేర్చుకోవాల్సిన అన్ని విద్యల్ని నేర్చుకున్న రేణు దేశాయ్ లోని సెన్సిబిలిటీస్ గురించి అభిమానుల‌కు తెలుసు.

అయితే రేణు దేశాయ్ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీయ‌బోతున్నారా? తెలుగు నాట విశేషంగా అల‌రిస్తున్న బిగ్ బాస్ హోస్ట్ గా మైమ‌రిపించ‌బోతున్నారా? అంటే అవున‌నే హింట్ అందింది. అయితే ఇప్ప‌టికే ఈ షో వ్యాఖ్యాత‌లుగా విక్ట‌రీ వెంక‌టేష్, అల్లు అర్జున్, దేవ‌ర‌కొండ, రానా వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. స్టార్ మా ఆ మేర‌కు స‌ద‌రు హీరోల్ని సంప్ర‌దించినా స‌రైన స్పంద‌న లేదట‌. వీళ్లు ఎవ‌రూ ముందుకు రాని ప‌క్షంలో రేణు దేశాయ్ ని వేరొక ఆప్ష‌న్ గా ఎంపిక చేసుకున్నార‌ట‌. అయితే రెగ్యుల‌ర్ టీవీ షోల‌తో పోలిస్తే బిగ్ బాస్ హోస్ట్ గా రేణు ఎక్కువ ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సి ఉంటుంది. కార్య‌క్ర‌మం ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా చేయాలంటే ఎంతో టాక్టిక్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మ‌రి రేణు హోస్టింగ్ చేస్తున్నారా.. లేక ఈ కార్య‌క్ర‌మంలో పార్టిసిపెంట్ గా ఉంటారా? అన్న‌దానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది. స్టార్ మా నుంచి రేణుకు వ‌ర్త‌మానం అందింద‌న్న స‌మాచారం అయితే లీకైంది.

User Comments