ఈ ఏజ్‌లో పెళ్లేంట‌మ్మా?

Last Updated on by

లేట్ ఏజ్‌లో పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు ఉన్నారు. 60లో, 70లో, 90లో కూడా పెళ్లి చేసుకున్న మ‌గానుభావులున్నారు. ఇలాంటి ప‌విత్ర భార‌త‌దేశంలో 37 ఏళ్ల వ‌య‌సు మ‌గువ పెళ్లి చేసుకుంటే త‌ప్పా? అంటే .. ఈ ప్ర‌శ్న‌కు రేణు దేశాయ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. అస‌లింత‌కీ ఈ ప్ర‌శ్న వేసింది ఎవ‌రు? అంటే త‌న స్నేహితుల నుంచే ఇలాంటి ప్ర‌శ్న ఎదురైంద‌ని రేణు స్వ‌యంగా తెలిపారు. దానికంటే స‌హ‌జీవ‌న‌మే బెట‌ర్ క‌దా! అన్న ప్ర‌స్థావ‌న వ‌చ్చిందిట‌.

మొత్తానికి రేణు నిశ్చితార్థం పూర్త‌యింది. అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ల‌భించింది. “మీరిద్ద‌రూ సంపాదించే వాళ్లే. అలాంట‌ప్పుడు మేం స‌హ‌జీవ‌నం చేస్తే స‌రిపోతుంది క‌దా!“ అని అడిగార‌ట‌. అయితే పెళ్లి అనేది గొప్ప అనుబంధం. మ‌న‌ల్ని మ‌నం తెలుసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే గొప్ప ఇనిస్టిట్యూట్‌.. అని రేణు అభిప్రాయ‌ప‌డ్డారు. పెళ్లి శాంతిని ఇస్తుంద‌ని తెలిపారు. ఇదివ‌ర‌కూ స‌హ‌జీవ‌నం చేశాను. అప్పుడు పెళ్లి చేసుకునే అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే అలా చేయాల్సొచ్చింద‌ని రేణు వెల్ల‌డించారు. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో ఆలోచించే త‌న‌కు స‌హ‌జీవ‌నం ఇష్టం లేద‌ని తెలిపారు. అందుకే ఇప్పుడు అలాంటి ప‌ని చేయ‌డం లేద‌ని, పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాన‌ని రేణు అన్నారు. త‌న పెళ్లిని స‌మ‌ర్ధించిన మేల్ ఫ్యాన్స్‌ని రేణు ఇదివ‌ర‌కూ ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి మంచి వాళ్ల‌ను క‌న్న త‌ల్లిదండ్రుల్ని అభినందిస్తున్నాన‌ని పొగిడేశారు.

User Comments