రేణు నిశ్చితార్థం.. స్వీట్‌ షాక్‌!

Last Updated on by

రేణు దేశాయ్ ఇచ్చిన స‌డెన్ ట్విస్ట్ ప‌వ‌న్ అభిమానుల‌కు మామూలుగా త‌గ‌ల్లేదు. స‌డెన్‌గా రింగులు మార్చేసుకుని నా ని నిశ్చితార్థం పూర్త‌యింది.. ఆడాళ్ల కంటే మ‌గాళ్లే నాకు ఎక్కువ‌గా స‌పోర్టుగా నిలిచారంటూ రేణు ట్వీట్ చేసేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. రేణు నేటి ఉద‌య‌మే త‌న‌కు నిశ్చితార్థం జ‌రిగిన విష‌యాన్ని స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో వెల్ల‌డించ‌డ‌మే గాకుండా ఓ ఫోటోని ఉంచారు. ఈ ఫోటోలో పెళ్లికొడుకు వివ‌రం ఏదీ క‌నిపించ‌లేదు కానీ త‌న‌కు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తిని మాత్రం ఫైన‌ల్‌గా డిక్లేర్ చేసింది. రేణు తాను పెళ్లాడ‌బోయే వ‌రుడితో ఉంగరాలు మార్చుకున్న ఫొటోను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకుని, నిశ్చితార్థం జరిగింద‌ని తెలిపారు. తనకు కాబోయే భర్తకు ధన్యవాదాలు చెప్పారు. బాధ నుంచి కోలుకునేందుకు నాకు సహాయంగా నిలిచినందుకు నీ హానెస్టీ హార్ట్‌కి ధన్యవాదాలు అని రేణు సామాజిక మాధ్య‌మాల్లో పేర్కొంది.

తాను పెళ్లాడుతున్న వ్యక్తి పేరేంటి? అత‌డెవ‌రు? ఏం చేస్తాడు? లాంటి వివ‌రాల్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు.త‌న నిర్ణ‌యానికి మ‌ద్ధ‌తునిచ్చిన కుర్రాళ్ల‌ను క‌న్న త‌ల్లిదండ్రుల‌ను అభినందించాల‌ని, అది మంచి పెంప‌కం అని రేణు పొగిడేశారు. వాస్త‌వానికి.. రేణు పెళ్లి చేసుకుంటానన్న మాట‌కు ఇదివ‌ర‌కూ ప‌వ‌న్ అభిమానులు వ్య‌తిరేకించారు. ఆ కార‌ణంగానే రేణు కాస్త ఎమ‌ష‌న‌ల్‌గానే ఈ నిశ్చితార్థం సంగ‌తిని ట్వీట్ చేశార‌ని అర్థ‌మైంది అంద‌రికీ.

User Comments