రిజ‌ల్ట్ 2019: జ‌గ‌న్ సీఎం అయ్యే తేదీ

Last Updated on by

ఏపీ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ పై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. దాదాపు 150 సీట్ల‌లో వైకాపా లీడ్ చేస్తోంది. తేదేపా కేవ‌లం 20 ప్ల‌స్ సీట్ల‌లో మాత్ర‌మే మెజారిటీలో ఉంది. ఇక జ‌న‌సేన ప్ర‌భావం ఒక‌టి రెండు చోట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కానుంది. అంతా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్టే జ‌రుగుతోంది.

ఇక వైకాపా విక్ట‌రీ ఖాయ‌మేన‌ని భావించిన పార్టీ నాయ‌కులు- కార్య‌క‌ర్త‌లు అప్పుడే సీఎం జ‌గ‌న్ అంటూ నినాదాలు చేస్తూ కుర్చీ ఎక్కే ముహూర్తాన్ని ప్ర‌క‌టించేశారు. ఇంత బంపర్ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో జగన్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వ‌చ్చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు ఒక తేదీని ప్ర‌క‌టించారు. ఈ నెల 30న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు. వారం రోజుల్లో ఇదే రోజున అంటే గురువారం నాడు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. టైమ్ ఎప్పుడు? అన్న‌ది ముహూర్తం ఫిక్స్ చేయాల్సి ఉందింకా. ఆస‌క్తిక‌రంగా అదే రోజు ప్ర‌పంచ వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ప్రారంభం కానుంది.

Also Read : Date Set For Jagan Oath-Taking Ceremony

User Comments