రిజ‌ల్ట్ 2019: బాబు తోలు తీసిన ఎంప్లాయ్స్‌!

Last Updated on by

ఏపీ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ పై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. దాదాపు 150 సీట్ల‌లో వైకాపా లీడ్ చేస్తోంది. తేదేపా కేవ‌లం 20 ప్ల‌స్ సీట్ల‌లో మాత్ర‌మే మెజారిటీలో ఉంది. ఇక జ‌న‌సేన ప్ర‌భావం ఒక‌టి రెండు చోట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కానుంది. అంతా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్టే జ‌రుగుతోంది.

ఇక వైకాపా విక్ట‌రీ ఖాయ‌మేన‌ని భావించిన పార్టీ నాయ‌కులు- కార్య‌క‌ర్త‌లు అప్పుడే సీఎం జ‌గ‌న్ అంటూ నినాదాలు చేస్తూ కుర్చీ ఎక్కే ముహూర్తాన్ని ప్ర‌క‌టించేశారు. ఇదిలా ఉంటే ఈసారి చంద్ర‌బాబును కుర్చీలోంచి కిందికి లాగేయ‌డానికి కార‌ణమేంటి? అని విశ్లేషిస్తే అస‌లు ర‌హ‌స్యం తెలిసొచ్చిందిలా.

ఈసారి చంద్ర‌బాబుపై పంచ్ వేసింది ప్ర‌భుత్వ ఉద్యోగులే. ప్ర‌తిసారి అయినదానికి కానిదానికి త‌మ‌పై ప‌డి ఏడిస్తే ఎలా ఉంటుందో బాబుకు మ‌రోసారి రుచి చూపించారు. చంద్ర‌బాబు మ‌రో ఐదేళ్లు ఉంటే త‌మ‌కు న‌ర‌క‌మేన‌ని భావించిన ఉద్యోగులు గంప‌గుత్త‌గా వైకాపాకు గుద్దేశార‌ని అంచ‌నా వేస్తున్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్ రిపోర్ట్ కూడా అదే చెబుతోంది. ఉద్యోగుల‌పై బాబు ప్ర‌భుత్వం అన్నివేళ‌లా ఒత్తిడిని పెంచుతోంది. అంతేకాదు పార్టీ ప‌నుల‌కు వాళ్ల‌నే వాడేస్తూ చికాకులు క‌లిగించ‌డం కూడా ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రోవైపు ఫించ‌ను ప‌థ‌కాలు.. మ‌హిళ‌ల్ని, రైతుల్ని మ‌భ్య పెట్టే ప‌థ‌కాలు ఏవీ వ‌ర్క‌వుట‌వ్వ‌లేద‌ని ప్ర‌భుత్వ మార్పును ప్ర‌జ‌లు కోరార‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

Also Watch : Election Results-2019

User Comments