Last Updated on by
రైటింగ్ టేబుల్ పై సినిమా మొదలవుతుంది.. అటుపై ఎడిటింగ్ టేబుల్ పై ఎండ్ అవుతుంది. ఆ మధ్యలో అసలేం జరుగుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ, ఎప్పటికీ కొమ్ములు తిరిగిన ఫిలింమేకర్ సైతం సమాధానం చెప్పలేడు. ఇదే మాటను ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వర్మ కూడా చెప్పారు. అయితే అది ఆయన చెప్పడం కాదు కానీ, ప్రఖ్యాత హాలీవుడ్ ఫిలింమేకర్, సస్పెన్స్ సినిమాల స్పెషలిస్ట్ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ చెప్పిన ఓ ఆసక్తికర పాయింటును ఆర్జీవీ గుర్తు చేసే ప్రయత్నం చేశారనడం కరెక్ట్. “సినిమా మొదలయ్యేది రైటింగ్ టేబుల్ పై .. అప్పటి నుంచి చివరికి ఎడిటింగ్ టేబుల్‌పైకి వచ్చేవరకూ .. ఆ మధ్యలో అసలేం జరుగుతుంది.. అన్నది ఎవరూ చెప్పలేరు“ అని హిచ్‌కాక్ తన అనుభవం నుంచి ఓ కొటేషన్‌ని ఇచ్చారు. దానిని ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆర్జీవీ .. అదేదో తానే కనిపెట్టినట్టు ఫీలయ్యారు.
అన్నట్టు అసలు ఆర్జీవీ సినిమా తీస్తే దానికి ఆది – అంతం ఉండదని, చాలా వరకూ ఆన్‌సెట్స్‌కి వెళ్లాకే ఆయన కథను డెవలప్ చేస్తారని చెబుతుంటారు. అలా నిర్మాతల సొమ్ముల్ని బాగా క్షవరం చేశాక, రియలైజవుతాడు. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. అయితే హిచ్‌కాక్ చెప్పినట్టు చేస్తామంటే ఇప్పటి దర్శకులకు అస్సలు కుదరదు. ముందే సినిమా మొత్తం విజువలైజ్ చేసుకుని ఉండాలి. దానిని అచ్చు గుద్దినట్టు తీయడంలో 200శాతం సక్సెసవ్వాలి. తేడా కొడితే ఇంకేమైనా ఉందా.. కెరీర్ గోల్మాల్ అయిపోతోంది. తొలి సినిమానే కాదు, తీసే ప్రతి సినిమాని ఒళ్లు దగ్గర పెట్టుకుని తేడా వేషాలు వేయకుండా తీయాల్సి ఉంటుంది. ఆర్జీవీలా పెనుపోకడలు పోతే మాత్రం అటుపై ఆ సంకెళ్లు నిర్మాతలకు చుట్టుకుంటాయన్న భయం కూడా నేటితరం దర్శకులకు ఉంటోంది. ఇప్పుడర్థమైందా.. ఆర్జీవీ సర్ మీరు ఎంత వెనకబడ్డారో. వివాదాలు రాజేయడం.. మెగా ఫ్యామిలీని కెలకడం అనుకుంటున్నారా? పవన్‌తో కెలుకుడు తంతు ముగిసింది కాబట్టి ఇకనైనా సినిమాలు చేయండి ప్లీజ్. అపుడెపుడో శివ, సత్య, సర్కార్, 24/11 ఎటాక్స్ అంటూ అద్భుతమైన సినిమాలిచ్చిన మీరు ఎందుకిలా అయిపోయారు? అని అభిమానులంతా లబోదిబోమంటున్నారు. అలాంటివారిని నీరసం నుంచి బయటపడేసే ఒక్క సినిమా చేయరూ ప్లీజ్! ఒక్కటి ప్లీజ్!!
User Comments