ఎన్నిక‌ల ముందు వ‌ర్మ‌ గ్యాంబ్లింగ్!!

Last Updated on by

ఎన్నిక‌ల సిత్రాలు మామూలుగా లేవండోయ్! ఎల‌చ్చ‌న్ వ‌త్తాంది అంటేనే గ్యాంబ్ల‌ర్స్ గ్యాంబ్లింగ్ కి రెడీగా ఉంటారు. ఈ గ్యాంబ్లింగ్ ఏ రేంజులో ఉంటుంది? అంటే ప్ర‌త్య‌ర్థిని ఓడించేందుకు నానా కుట్ర‌లు.. కుతంత్రాలు.. కుయుక్తుల‌తో రెడీగా ఉంటారు. ఈసారి ఏపీ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలో అధికార ప‌క్ష నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబును, తేదేపాని ఓడించేందుకు చాలానే ప్లానింగ్ లో ఉన్నాయి ప్ర‌తిప‌క్ష‌, విప‌క్షాలు. ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబుపై ఎటాక్ తీవ్ర స్థాయిలో ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. అత‌డిపై సినిమాల దాడి ప్ర‌స్తుతం హాట్ టాపిక్.

ఇప్పుడు ఓ సినిమా రూపంలోనూ చంద్ర‌బాబుపై ఎటాక్ పీక్స్ లో ఉంద‌ని తెలుస్తోంది. స‌రిగ్గా ఆంధ్ర ప్ర‌దేశ్ ఎల‌క్ష‌న్స్ ముందు `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీని వ‌ల్ల ఆర్జీవీ జాక్ పాట్ కొట్టాడ‌ని, వైకాపా- టీఆర్ఎస్ అల‌యెన్స్ నుంచి అదిరిపోయే తాయిలం ముడుతోంద‌ని మాట్లాడుకుంటున్నారు. మార్చి లేదా ఏప్రిల్ లో ఏపీ ఎన్నిక‌లు ఉండ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎల‌క్ష‌న్ కి నెల‌రోజుల ముందు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ప్లాన్ వెన‌క దాగి ఉన్న న‌గ్న‌ స‌త్యం ఏంటో? అంటూ ఫిలిం జ‌నం ఒక‌టే ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. వివాదాల వ‌ర్మ వాటే స్ట్రాట‌జీ అంటూ మాటా మంతీ సాగుతోంది. అన్న‌ట్టు వాయిదాల ఫ‌ర్వంలో రిలీజ‌వుతున్న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఇదివ‌ర‌కూ వాయిదా ప‌డ‌డం క‌లిసొచ్చింద‌నే ముచ్చ‌టా సాగుతోంది. మొత్తానికి రాజ‌కీయ పార్టీల నుంచి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కి తాయిలం ముడుతోంద‌న్న వాద‌నా ఇప్పుడు బ‌లంగా తెర‌పైకి వ‌చ్చింది. ఇక వ‌ర్మ ఇప్ప‌టికే త‌న సినిమా ప్ర‌చారానికి చంద్ర‌బాబును, కేఏ పాల్ ను, వైకాపా నాయ‌కుల్ని, టీవీ 9 ఇత‌ర మీడియాల్ని.. దొరికిన వాళ్లంద‌రినీ వాడేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాడ‌కం యందు ఆర్జీవీ వేర‌యా విశ్వ‌ధాభి రామ వినుర వేమ‌!!!

User Comments