కోర్టు గొడ‌వ‌: ఇది సెన్సార్ త‌ప్పిద‌మా?

Last Updated on by

ఆర్జీవీ దెబ్బ‌కు ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయారా? ఆయ‌న ప్ర‌చారార్భాటం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత‌ల‌కు త‌ల బొప్పి క‌ట్టిస్తోందా? అంటే అవున‌నేందుకు ప్రూఫ్ ఇదే. ఇప్ప‌టికే వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` వివాదం ర‌చ్చ‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన `వెన్నుపోటు సాంగ్` చిత్ర‌యూనిట్ ని ముప్పు తిప్ప‌ల‌కు గురి చేస్తోంది. ఈ పాట‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబును విల‌న్ గా చూపించారు వ‌ర్మ‌. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచింది అల్లుడు చంద్ర‌బాబే అంటూ పాట‌లో ఎలివేట్ చేశారు. దీంతో వ‌ర్మ‌పై ప‌లువురు కేసులు వేశారు. కోర్టులో ఈ కేసు ప‌రిశీల‌న‌కు వెళ్లింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఏకంగా ప్రాంతీయ‌ సెన్సార్ బోర్డ్ కే లీగ‌ల్ నోటీసులు పంపించ‌డం సంచ‌ల‌న‌మైంది. బోర్డ్ చైర్మ‌న్ స‌హా చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డికి నోటీసులు పంపార‌ట‌.

తూ.గో జిల్లాకు చెందిన ఎస్.వి.ఎస్.ఎన్ అనే పిటిష‌నర్ ఈ కేసును సీరియ‌స్ గా హ్యాండిల్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే తెలంగాణ హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. తొలిగా సెన్సార్ బోర్డ్, చిత్ర‌నిర్మాత‌ల‌కు నోటీసులు పంపడంతో ఫిలింవ‌ర్గాల్లో ఇది వేడి పెంచుతోంది. మూడు వారాల్లోగా ఈ కేసు విష‌య‌మై పూర్వాప‌రాల్ని ప‌రిశీలించాల‌ని అధికారుల్ని కోర్టు కోరింది. ప్ర‌స్తుతం గొడ‌వ ముదిరిపాకాన ప‌డింది. ఆర్జీవీ ఈ ప్ర‌మాదాన్ని ఎలా డీల్ చేస్తారు? అన్న‌ది వేచి చూడాల్సిందే.

User Comments