`ఆఫీస‌ర్` కాపీ క‌థేనా?

Last Updated on by

ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వ‌ర్మ వివాదాల గురించి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న‌పై కాపీ క్యాట్ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో `ఆఫీస‌ర్‌` క‌థ‌ను ఆయ‌న ఎక్క‌డి నుంచైనా కాపీ కొట్టారా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ఓ ర‌చ‌యిత ప్ర‌త్యేకించి ఆర్జీవీని టార్గెట్ చేస్తూ నా క‌థ‌ల్ని ఆయ‌న కాపీ కొట్టేశాడంటూ మీడియాలో ప్ర‌చారం చేయ‌డంపైనా ఆరాలు సాగుతున్నాయి.

ఆ క్ర‌మంలోనే ఆర్జీవీ `ఆఫీస‌ర్‌` క‌థ ఎక్క‌డి నుంచి పుట్టిందో ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఆఫీస‌ర్ క‌థ‌కు ఓ రియ‌ల్ పోలీసాఫీస‌ర్ స్ఫూర్తి. ఆయ‌నే ముంబై అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న కె.ఎం. 2010 ఐపీఎస్ బ్యాచ్ నుంచి వ‌చ్చిన ఆయ‌న నేరుగా ముంబై అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌ని, న‌గ‌రంలోని క్రైమ్‌ని స‌మ‌ర్థంగా హ్యాండిల్ చేశారు. ముంబైలో మాఫియా ఆయ‌నంటే ఉ… పోస్తుంది. అంతేకాదు అత‌డు స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (సిట్‌)ని హ్యాండిల్ చేసిన కీల‌క అధికారి. పోలీసాఫీస‌ర్ ప్ర‌స‌న్న జీవితంలో ఎదురైన స‌వాళ్ల‌ను క‌థ‌గా రాసుకుని ఆర్జీవీ `ఆఫీస‌ర్‌` చిత్రాన్ని తెర‌కెక్కించాన‌ని చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమా కూడా ప్ర‌స్తుతం లైవ్‌లో ఉన్న సిన్సియ‌ర్‌ పోలీసాఫీస‌ర్ ప్ర‌స‌న్న బ‌యోపిక్ అనే చెప్పాలి. మొత్తానికి వ‌ర్మ బ‌యోపిక్‌నే తెర‌కెక్కిస్తున్నార‌న్న‌మాట‌!

User Comments