కొత్తగా ఉంటుందా.. చెత్తగా ఉండబోతుందా

Last Updated on by

కొన్నేళ్లుగా వ‌ర్మ సినిమా అంటే పెద్ద‌గా ఆశించ‌డం మానేసారు ప్రేక్ష‌కులు. ఆయ‌న నుంచి అద్భుతాలు ప‌క్క‌న‌బెట్టి క‌నీసం రెండు గంట‌లు పూర్తిగా సినిమా చూస్తే చాలు అనుకుంటున్నారు. అలా మారిపోయాడు వ‌ర్మ ఇప్పుడు. ఒక‌ప్పుడు సంచ‌ల‌నాలు సృష్టించిన ద‌ర్శ‌కుడేనా ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తున్న‌ది అనేంత‌గా దిగ‌జారిపోయాడు వ‌ర్మ‌. ఈయ‌న సినిమా అంటే ఇప్పుడు చూడ‌టం ఎందుకులే అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న వ‌ర్మ‌.. ఇప్పుడు నాగార్జున లాంటి స్టార్ ను ఒప్పించాడు. ఈయ‌న‌తో ఆఫీస‌ర్ సినిమా చేసాడు. జూన్ 1న విడుద‌ల కానుంది ఈ చిత్రం. తాజాగా సెన్సార్ కూడా పూర్తైపోయింది. ఈ చిత్రంపై ఎందుకో కానీ ముందు నుంచి కాస్త ఆస‌క్తి ఉంది. ఎందుకంటే పెద్ద హీరోతో సినిమా.. పైగా పాతికేళ్ళ త‌ర్వాత నాగ్ తో కాంబినేష‌న్.. అన్నింటికి మించి సినిమా ఓపెనింగ్ రోజు నాగార్జున ఈ చిత్రం గురించి చెప్పిన విధానంతో ఏదో ఉంటుంద‌ని అంతా అనుకున్నారు.

ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత చూస్తే ఏమీ లేదు. ఎప్ప‌ట్లాగే మ‌ళ్లీ అదే చెత్త‌ను తీసుకొచ్చి పెట్టాడు వ‌ర్మ‌. ఏ మాత్రం మార‌కుండా మ‌ళ్లీ అదే రొటీన్ మూస మాఫియాను ఇందులో చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే ఖచ్చితంగా నాగార్జున మాత్రం ఈ చిత్రం వ‌ర్మ‌ను మ‌ళ్లీ కొత్త‌గా ప‌రిచ‌యం చేస్తుంద‌ని ధీమాగా చెబుతున్నాడు. సెన్సార్ టాక్ ప్ర‌కారం చూస్తే ఈ చిత్రం కూడా ప‌క్కా వ‌ర్మ స్టైల్లోనే సాగుతుంది. హైద‌రాబాద్ నుంచి ముంబైకి స్పెషల్ కేస్ ప‌నిమీద వెళ్లిన ఆఫీస‌ర్ కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి.. అందులో హీరో కూతుర్ని ఎందుకు లాగారు అనేది క‌థ‌. హాలీవుడ్ సినిమా టేకెన్ నుంచి ఈ చిత్రం స్పూర్థి పొందార‌ని టాక్ వినిపిస్తుంది. అయితే ఎన్ని ఉన్నా.. అన్నింటికీ మించి వ‌ర్మ స‌ర్ ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీతో పెట్టుకున్న సున్నం కూడా సినిమాపై అంచ‌నాలు త‌గ్గించేసింది. ఇన్ని ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య ఆఫీస‌ర్ వ‌చ్చి ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో..?

User Comments