ఆఫీస‌ర్ రాబోయే త‌రం ద‌ర్శ‌కుల‌కు ఓ డిక్ష‌న‌రీ

Last Updated on by

స‌రిగ్గా ఇప్పుడు ఆఫీస‌ర్ కొన్న బ‌య్య‌ర్ల‌ను ఇదే అడ‌గాల‌నిపిస్తుంది. ప్లాపులు వ‌స్తాయి.. డిజాస్ట‌ర్లు వ‌స్తాయి.. కానీ కొన్ని మాత్ర‌మే అలా చ‌రిత్ర‌లో నిలిచిపోతుంటాయి. ఇప్పుడు ఆఫీస‌ర్ కూడా అలాంటిదే. శివ‌తో ఓ సినిమాను ఎంత బాగా తీయొచ్చో చూపించిన నాగార్జున‌, రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఇప్పుడు ఆఫీస‌ర్ తో ఓ సినిమాను ఎలా తీయ‌కూడ‌దో కూడా చూపించారు. రాబోయే త‌రం ద‌ర్శ‌కుల‌కు శివ ఓ డిక్ష‌న‌రీ అయితే.. ఆఫీస‌ర్ కూడా ఓ డిక్ష‌న‌రీనే. ఎలా తీయాలో ఒక‌టి చూపిస్తే.. తీయ‌కూడ‌దో మ‌రోటి చూపిస్తుంది. సాధార‌ణంగా ఏ సినిమా విడుద‌లైనా కూడా మూడు రోజుల వ‌సూళ్లు ఎంత అంటారు.. కానీ ఆఫీస‌ర్ కు ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే తొలిరోజే తీసేసారు కాబ‌ట్టి.

మొద‌టి రోజు మ‌రీ దారుణంగా 45 ల‌క్ష‌లు తీసుకొచ్చిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత పూర్తిగా పోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 80 ల‌క్ష‌ల షేర్ కూడా తీసుకురాలేదు. కోటి మార్క్ కూడా దాట‌డం క‌ష్ట‌మే. ఈ మ‌ధ్య కాలంలో ఓ స్టార్ హీరో న‌టించిన సినిమా ఇంత దారుణంగా ఎప్పుడూ బోల్తా కొట్ట‌లేదు. ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్ ఒక‌త‌ను ఏకంగా ఆత్మ‌హ‌త్యే త‌న‌కు శ‌ర‌ణ్యం అంటున్నాడు. మ‌రి.. ఆఫీస‌ర్ బాధితులు ఇంకా ఎంత‌మంది ఉన్నారో..?

User Comments