చ‌రిత్ర సృష్టించిన ఆఫీస‌ర్

Last Updated on by

అదేంటి.. అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాను ప‌ట్టుకుని చ‌రిత్ర సృష్టించిన ఆఫీస‌ర్ అంటున్నారు అనుకుంటున్నారా..? అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఒక్కోసారి చ‌రిత్ర‌లు సృష్టిస్తుంటాయి. కాక‌పోతే ఆ చ‌రిత్ర పుస్త‌కాలు మ‌రోలా ఉంటాయంతే. ఇప్పుడు కింది నుంచి వ‌చ్చే చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఎప్ప‌టికీ నిలిచి పోయే ఓ పేజీ రాసుకున్నాడు ఈ ఆఫీస‌ర్. వ‌ర్మ‌ను న‌మ్మి నాగార్జున ఎంత పెద్ద త‌ప్పు చేసాడో విడుద‌లైన రోజు మార్నింగ్ షోకే అర్థ‌మైపోయింది. ఈ సినిమాకు తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో అక్ష‌రాలా 45 ల‌క్ష‌లు వ‌చ్చాయి. ఈ రోజుల్లో ఊరు పేరు తెలియ‌ని సినిమాల‌కు కూడా తొలి రోజు దీనికంటే మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. కానీ నాగార్జున లాంటి స్టార్ హీరో.. వ‌ర్మ లాంటి ద‌ర్శ‌కుడు.. పైగా సంచ‌ల‌న కాంబినేష‌న్ క‌లిసి కూడా ఆఫీస‌ర్ ను అడ్ర‌స్ లేకుండా చేసారు.

ఈ చిత్రం ఫుల్ ర‌న్ లో క‌నీసం కోటి రూపాయ‌ల మార్క్ అయినా దాటుతుందా అనేది ఇప్పుడు అంద‌రిలోనూ వ‌స్తున్న అనుమానం. ఇదే కానీ జ‌రిగితే నాగార్జున‌కు ఇంతకంటే అవ‌మానం మ‌రోటి ఉండ‌దు. నాగార్జున కెరీర్ లో అత్యంత చెత్త సినిమాగా అప్ప‌ట్లో కేడీ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఇన్నేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ ఆఫీస‌ర్ వ‌చ్చి.. కేడీకి ఊర‌ట‌నిచ్చింది. ఇది చూసిన త‌ర్వాతైనా వ‌ర్మ‌ను మ‌రోసారి ఏ స్టార్ హీరో న‌మ్మ‌కుండా ఉంటాడేమో చూడాలి..! అవును.. మ‌రిచిపోయాం.. చెప్పింది చెప్పిన‌ట్లు తీయ‌క‌పోతే వ‌ర్మ త‌న్నించుకుంటాన‌ని చెప్పి న‌ట్లు గుర్తు.. మ‌రిప్పుడు నాగార్జున అదే ప‌నిమీదున్నాడేమో..?

User Comments