ఆర్జీవీ టెర్ర‌రిజం స్కూల్‌

Last Updated on by

“నా స్కూల్ అంద‌రి స్కూల్ లాంటిది కాదు. ఇదో డిఫ‌రెంట్ స్కూల్‌. ఇక్క‌డ తీవ్ర‌వాదుల్ని త‌యారు చేస్తాను. అచ్చం నాలాటి వాళ్ల‌ను త‌యారు చేస్తాను“ అని అన్నారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇంత‌కీ ఎక్క‌డ త‌యారు చేస్తారు ఈ తీవ్ర‌వాదుల్ని? అంటారా? అదే ఆ స్కూల్ పేరు `అన్‌స్కూల్‌`. ఇక్క‌డ ఏవీ నేర్ప‌రు. యాటిట్యూడ్ నేర్పుతారు. ప్ర‌వ‌ర్త‌న‌, ఆలోచ‌న తీరు మారుస్తారు. ఇంకా చెప్పాలంటే ప్ర‌తి ఒక్క‌రినీ రామ్‌గోపాల్ వ‌ర్మ‌లా మారుస్తారు. ఇందుకు ఓ ఎన్నారై శ్వేతారెడ్డి పెట్టుబ‌డులు పెడుతున్నారు. నిన్న‌టి సాయంత్రం వేళ అన్‌స్కూల్ ప్రెస్‌మీట్ లో వింత‌వింత‌లెన్నో చెప్పారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. నాలాంటి తీవ్ర‌వాదుల్ని త‌యారు చేస్తానని ప్రామిస్ చేశారు.

ఇంత‌కీ మీస్కూల్లో మామూలుగా ఆలోచించేవాళ్లు సూట‌వుతారా? అన్న `మై ఫ‌స్ట్ షో` ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. ఇక్క‌డ చేరేవాళ్ల అర్హ‌త‌ను మేం నిర్ణ‌యిస్తాం. ముందుగా మేం ఇచ్చే ప్ర‌శ్నాప‌త్రానికి జ‌వాబులు రాయాలి. ఫ్లాప్ అయితే అది ఎందుకు ఫ్లాపైందో చెప్ప‌డం ఓ క‌ళ‌. ఆ క‌ళ‌లో ఎవ‌రి స‌మ‌ర్ధ‌త ఎంతో చూస్తాం… ఇదో ఎగ్జాంపుల్ క్వ‌శ్చ‌న్ మాత్ర‌మే. ఇలాంటివి ఎన్నో ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఇది పూర్తిగా ఆలోచ‌న‌పైనే ఉండే ప్ర‌శ్న‌లు. పాత చింత‌కాయ ప‌ద్ధ‌తి టీచింగ్ ఇక్క‌డ ఉండ‌దు. టెక్నికాలిటీస్‌పై శిక్ష‌ణ ఉంటుంది. హైద‌రాబాద్, ముంబై, అమెరికాలో అన్‌స్కూల్స్ తెరుస్తున్నాం… అని తెలిపారు.

User Comments